Posts

Yureka Luck O Reka (Telugu Rock Song) - Ram Prasad K S V N S

Image
Wishing you all, a #HappyNewYear2024 Here is the Rocking #YurekaLuckOReka dedicated to all of you for giving me an amazing 2023. Song Name: Yureka Luck O Reka Release Date: 31st December 2023 Language: Telugu Composer: Ram Prasad K S V N S Lyrics: Ram Prasad K S V N S Singer: Ram Prasad K S V N S

What is Love? Why do we love someone? Meaning of Love (in Telugu) • 'ప్రేమ' అంటే ఏమిటి?

Image
ఈ భూమిమీద ఉండే ఏ జీవికైనా ఎమోషన్స్ ఉంటాయని మనం నమ్ముతాం. అంటే సంతోషం, దుఃఖం, బాధ, కోపం, జాలి, ఇలాంటివి... అయితే అన్ని జీవరాశులలోనూ కామన్ గా కనిపించే ఒక అందమైన ఎమోషన్... ప్రేమ... ప్రేమించడం మనకి తెలుసు. అందరూ ఒకేలా ప్రేమించక పోవచ్చు, బట్ ప్రేమించడంలో ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది.ఒక వ్యక్తిని ఎంతలా  ప్రేమిస్తామో చెప్పగలం కానీ ఎందుకు ప్రేమిస్తామో కచ్చితంగా  చెప్పలేం! సైకాలజీ ప్రకారంగా ప్రేమ యొక్క లోతుల్ని తెలుసుకొని, అసలు ఒకరిపై ఒకరికి ప్రేమ అనేది ఎందుకు పుడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం... సింపుల్ గా చూసినప్పుడు, ప్రేమ అనేది ఇద్దరు వేరువేరు మనుషులని, వారి మనసులని ఏకం చేస్తుంది... కేవలం ఒక మనిషి మాత్రమే కాదు, ఈ ప్రకృతిలో ఎలాంటి జీవైనా తన జీవితంలో వేరొక జీవిని ప్రేమిస్తుంది. ఇంత అనంతమైన ప్రకృతితో పాటూ ఇందులో మనం చూసే అనేక కోట్ల జీవరాశులు పుట్టడానికీ, కలిసి జీవించడానికీ గల కారణం kuda ప్రేమే... ఒక జీవికి మరొక జీవి పరస్పరం సహాయపడేలా చేస్తూ, జీవితంలో కష్టాలనూ, బాధలనూ ఓర్చుకొని ముందుకు సాగగలమనే ధైర్యాన్ని ఇచ్చే గొప్ప సాధనమే ప్రేమ... అయితే, ప్రేమకు షరతులు లేవు... ఎవరైనా,...

Naatho Vacchey (Telugu Lyrical Song) - Ram Prasad K S V N S

Image
  Song Name: Naatho Vacchey (Telugu) Composer: Ram Prasad K S V N S Release Date: 22 October 2023 Telugu Love Songs | Telugu Melody Songs | Telugu Movies | Telugu Lyrics | Telugu

What is Reserve Bank of India? (in Telugu) • భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క పనులు ఏమిటి?

Image
రూపాయి... ఇది మనం బ్రతకడానికి ఉపయోగపడే ఒక కాగితపు నోటు మాత్రమే కాదు. ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా పేరు గడించిన మన Indian ఎకానమీకి కూడా ప్రాణమని చెప్పవచ్చు.  అయితే, మనకి ప్రతి విషయంలోనూ అవసరమైన ఈ రూపాయిని దేశ నలుమూలలకీ ప్రవహింపచేసి మన ఆర్ధిక వ్యవస్థను బ్రతికించే గుండెకాయ ఏంటో తెలుసా? అదే RBI, లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... భారతదేశంలో ఉండే బ్యాంకులన్నిటికీ రారాజు.  మన చేతిలోకి వచ్చే ప్రతి కరెన్సీ నోటు పైనా, ఈ బ్యాంకు పేరుని చూడొచ్చు. RBI యొక్క స్ట్రక్చర్, దాని పనితీరు, ఇంకా అది మన దేశ ఆర్ధిక వ్యవస్థ నిర్మాణానికి ఏ విధంగా తోడ్పడుతుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం... భారతదేశంలో జరిగే అన్ని ట్రాన్సాక్షన్స్ కేవలం రూపాయి కరెన్సీలో జరుగుతాయి. లావాదేవీలు జరపడానికి అవసరమైన కరెన్సీ నోట్లనూ, చిల్లర కాసులనూ RBI ముద్రిస్తుంది. ఇంటర్నెట్ ఆధారిత డిజిటల్ లావాదేవీలను కూడా RBI పర్యవేక్షిస్తుంది.  Reserve Bank Of India లేదా RBI 1935 లో స్థాపించబడింది. దీని ముఖ్య ఉద్దేశం, భారతీయ ఆర్ధిక వ్యవస్థని విజయవంతంగా నడిపించడం. భారతదేశంలో ఉండే అన్ని బ్యాంకులు RBI పర్యవేక్షణలోనే ఉంటా...

What is Buddhism? (Explained in Telugu) • బౌద్ధ తత్వం ఏం చెబుతోంది?

Image
బౌద్ధ మతం లేదా buddhism ప్రస్తుతం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద మతాచారంగా గుర్తింపు పొందింది. సుమారు 52 కోట్ల మంది బౌద్ధ మత సూత్రాలను అనుసరిస్తున్నారు. బౌద్ధ మతం అనగానే మనకి మొదటిగా గుర్తొచ్చేది, ధ్యానంలో ఉండే గౌతమ బుద్ధుని నిర్మలమైన స్వరూపం... మనం బౌద్ధ మతం గురించి, ఆ మతం ప్రపంచానికి ఇస్తున్న సందేశం గురించీ తెలుసుకోబోయే ముందు 'ధర్మం' అనే శబ్దానికి అర్ధాన్ని తెలుసుకోవాలి.  ధర్మం అంటే మన ముందు ఎన్నో అవకాశాలు ఉన్నప్పుడు, వాటిలో సరైనదాన్ని ఎలా ఎన్నుకోవాలో తెలుసుకోవడం. ఏ ఒక్కరికీ హాని కలిగించని సరైన నిర్ణయాలు తీసుకోవడం.  ధర్మాన్నే ఆధారంగా చేసుకొని నిరాడంబరమైన జీవితాన్ని లేదా simple లైఫ్ ని అనుసరించమని తెలిపే మతమే బౌద్ధ మతం. బౌద్ధ ధర్మం, ధర్మ వినయం, buddhism.. ఇలా ప్రస్తుతం మూడు  పేర్లతో ఈ మతం ప్రపంచమంతా వ్యాపించింది...  బౌద్ధ ధర్మం భారతదేశానికి చెందిన ఒక ప్రాచీనమైన మతం. ఇది పూర్తిగా గౌతమ బుద్ధుడు అనే మహా జ్ఞాని చేసిన హితబోధల ఆధారంగా స్థాపించబడింది.  'బుద్ధ' అనే పదానికి అర్ధం.. జ్ఞానం. బౌద్ధ మతం పూర్తిగా జ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఉంటుంది. బౌద్ధ ధర్మం ప్రకారం, ఈ ప్రపం...

What is Union Territory? (in Telugu) • యూనియన్ టెర్రిటరీ / కేంద్ర పాలిత ప్రాంతం అంటే ఏమిటి?

Image
కేంద్రపాలిత ప్రాంతాలు లేదా యూనియన్ టెర్రిటరీలనేవి భారతదేశంలో ఒక ప్రత్యేక పరిపాలనా విభాగాలు. భారత దేశంలో ఒకానోక ప్రాంతంలో ఉండే స్థానిక సంస్కృతి లేదా సున్నితమైన అంశాలను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతానికి యూనియన్ టెర్రిటరీ అనే స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది. భారతదేశ భూభాగం మొత్తం వివిధ రాష్ట్రాలు, ఇంకా యూనియన్ టెర్రిటరీలుగా విభజించబడింది. అయితే, రాష్ట్రాలు లేదా states కి వాటి సొంత ప్రభుత్వాలు ఉంటాయి. కానీ యూనియన్ టెర్రిటరీలకు మాత్రం సొంత ప్రభుత్వ పాలన అనేది ఉండదు. ఇవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం లేదా యూనియన్ గవర్నమెంట్ పరిపాలనలో ఉంటాయి. యూనియన్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ పాలనలో ఉండటం మూలాన ఆ ప్రాంతాలకి యూనియన్ టెర్రిటరీలన్న పేరు వచ్చింది. ఈ ప్రాంతాలు సాధారణంగా president of India లేదా రాష్ట్రపతి పాలనలో ఉంటాయి. 2022 నాటికి భారతదేశంలో మొత్తం 9 యూనియన్ టెర్రిటరీలు ఉన్నాయి. 1. Andaman and Nicobar islands, 2. Chandigarh 3. Dadra and nagar Haveli 4. Daman and Diu 5. Delhi 6. Jammu and Kashmir 7. Ladakh 8. Lakshadweep islands, ఇంకా  9. Puducherry Andaman Nicobar దీవులు, ఇంకా లక్షద్వ...

What is Asthma? • Causes of Asthma (in Telugu) • ఆస్థమా అంటే ఏమిటి?

Image
ఆస్థమా లేదా బ్రాంఖయల్ ఆస్థమా.. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి సుమారు 25 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఊపిరితిత్తులకు చేరే వాయు మార్గాలన్ని చీముడుతో నిండిపోడం, లేదా అవి ఉబ్బడాన్ని ఆస్తమా అని అంటారు. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే, ప్రాణానికే ప్రమాదం తెప్పించగలదని చెప్పొచ్చు.. అయితే, ఆస్తమా ఎందుకు వస్తుంది? ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి? ఆస్తమా వ్యాధిగ్రస్తులు యెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవాటిగురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనం ఊపిరి తీసుకునేటప్పుడు, శ్వాసనాళాలు లేదా bronchus రిలాక్స్ అవుతాయి. దీనివల్ల గాలి సులభంగా ఊపిరితిత్తులకు చేరడం, తిరిగి రావడం జరుగుతుంది.. కానీ, ఆస్థమా సోకినప్పుడు ఈవిధంగా జరగదు. హఠాత్తుగా శ్వాసనాళాల యొక్క కండరాలు ఉబ్బటం చేత ఊపిరితిత్తులు తగినంత గాలిని పీల్చుకోలేవు. అంతే కాకుండా ఆస్తమా అట్టాక్ వచ్చినప్పుడు శ్వాసకోశాలు చీమిడితో పూర్తిగా నిండిపోతాయి. ఆస్తమా పలువిధాలుగా బాధిస్తుంది. ఈ వ్యాధి సోకిన అందరిలో ఒకే రకమైన లక్షణాలు కనిపించవు. కొందరి...

What are Dimensions in Physics? (in Telugu) • భౌతికశాస్త్రం లోని 1D, 2D, 3D & 4D డైమెన్షన్స్

Image
మీరు ఇదివరకూ 2D, 3D అనే విషయాలను సినిమాల్లో చూసి ఉంటారు.. ఇక్కడ D అంటే Dimension అని అర్థం.. Physics ఇంకా mathematics లో కనిపించే ఈ Dimension అన్న విషయాన్ని నిజానికి అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇది సాధారణంగా ఒక వస్తువు ఏవిధంగా కనిపిస్తుంది, లేదా ప్రయాణిస్తుంది అన్న విషయాలని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకూ జరిగిన అధ్యయనాల ప్రకారం, ఒక వస్తువు సుమారు 11 రకాల డైమెన్షన్స్ లో ప్రయానించగలదు. అయితే, మీరు డైమెన్షన్స్ ని సులువుగా అర్థం చేసుకోవడానికి ఈ వీడియోలో మనకు బాగా తెలిసిన ఉదాహరణలతో విషయాలను పోల్చడం జరిగింది. అసలు Dimension అంటే ఏంటి, 1D, 2D, 3D ఇంకా 4D రకాల డైమెన్షన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏదైనా ఒక వస్తువు ప్రయాణించాలి అంటే ముందుగా అది ఏదో ఒక చోటు నుండి తన ప్రయాణాన్ని మొదలు పెట్టాలి.. ఉదాహరణకు, ఒక లిఫ్ట్ కింద ఫ్లోర్ నుండీ స్టార్ట్ అయితేనే పై ఫ్లోర్స్ కి వెళ్తుంది..  ఒక విమానం రన్ వే పై మొదలైతే నే గాల్లోకి ఎగురుతుంది..  ఈ విధంగా ఒక వస్తువు స్టార్ట్ అయ్యే చోటుని దాని యొక్క Origin అని పిలుస్తారు.. అయితే Origin కి, Dimension కి సంబంధం ఏమిటి అని మీరు అనుకుంటూ ఉం...

Types of Unemployment & Causes of Unemployment (in Telugu) • నిరుద్యోగ సమస్య ఎన్ని రకాలు?

Image
ఒక వ్యక్తి తగినంత విద్యార్హత, నైపుణ్యాలు కలిగి ఉండి కూడా, కోరుకున్న ఉద్యోగం లేదా పని సంపాదించుకొలేకపోతే... ఆ వ్యక్తిని నిరుద్యోగి అని అంటారు.. భారత దేశంలో నిరుద్యోగం లేదా UNEMPLOYMENT RATE 2019 ఫిబ్రవరి నాటికి 7.2 శాతం పెరిగింది. మన దేశంలో నిరుద్యోగులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు.. ఇది ఇలా కొనసాగితే, దేశ ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించే అవకాశం ఉంది.  నిరుద్యోగం పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే వాటి గురించి తెలుసుకునే ముందు, భారతదేశంలో నిరుద్యోగం ఎన్ని రకాలుగా ఏర్పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. భారత దేశంలో నిరుద్యోగ సమస్య 10 విధాలుగా ఉందని చెప్పవచ్చు.. 1. OPEN UNEMPLOYMENT గొప్ప విద్యార్హతలు, నైపుణ్యం కలిగిన అధిక శాతం మంది తగిన ఉద్యోగ అవకాశాలు లేక, ఆదాయ మార్గాలు ఏవీ కనిపించక.. ఏదో ఒక పని కోసం వెతుకుతూ ఉన్నారు.. ఈ స్థితిని OPEN UNEMPLOYMENT అని అంటారు. ఆర్థిక రంగం కంటే విద్యా వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతూ ఉండటం వల్ల, ఈ రకమైన నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది. 2. DISGUISED UNEMPLOYMENT పరిశ్రమల ఉత్పత్తి తక్కువగా ఉంటూ, వాటిలో పనిచేసే కార్మికులు, ఉద్యోగస్తుల సంఖ్య ఎక్కువైనట్లైతే ఆ పర...