ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి స్మార్ట్ పరికరాల వాడకం చాలా సులభతరంగా మారింది.. కేవలం వీటి స్క్రీన్ పై టచ్ చెయ్యడం ద్వారానో, లేదా మాటల సంకేతాల ద్వారానో మనకి కావలసిన వినోదాన్ని, సేవలని పొందగలుగుతున్నాం... ఇది ఎలా సాధ్యమైంది?!... మనం దీని గురించి తెలుసుకోవాలంటే, ముందుగా ఆపరేటింగ్ సిస్టమ్ అనే దాని గురించి తెలుసుకోవాలి.. అంటే... ఉదాహరణకు కంప్యూటర్లలో కనిపించే విండోస్, స్మార్ట్ ఫోన్లలో కనిపించే ఆండ్రాయిడ్, ఐ ఓ ఎస్ అనేవాటి గురించి తెలుసుకోవాలి... ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? అదెలా పనిచేస్తుంది అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. మనం వాడే ఫోన్, కంప్యూటర్, టీవీ మొదలైన స్మార్ట్ పరికరాలు వివిధ రకాల హార్డ్ వేర్ భాగాలతో నిర్మించబడతాయి... హార్డ్ వేర్ భాగాలంటే.. స్క్రీన్, కీబోర్డ్, కెమెరా, స్పీకర్, మదర్ బోర్డ్ మొదలైనవి.. ఈ భాగాలన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా సంక్లిష్టమైన విధానాలతో తయారవుతాయి... ఓ పరికరం సరిగ్గా పనిచేయాలంటే ఈ హార్డ్ వేర్ భాగాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి పనిచేయాలి... అంతే కాకుండా, ఇవి మనమిచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలి.. ఇలా వీటన్నిటినీ కలిపి పనిచేయించడాన...