Posts

Showing posts from 2021

What is Depression? Causes of Depression (in Telugu) డిప్రెషన్ అంటే ఏమిటి?

Image
ఒకరు ఎంత చిన్నవారైనా, ఎంత పెద్దవారైనా... తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు వారి భావోద్వేగాలను నియంత్రించడం ఎవరివల్లా కాని పని. అలా ఒకరి భావోద్వేగాలు పూర్తిగా నియంత్రణ తప్పినప్పుడు, అదొక తీవ్రమైన మానసిక సమస్యగా మారుతుంది..  ఈ పరిస్థితినే వైద్యపరంగా డిప్రెషన్ (DEPRESSION) అని పిలుస్తారు. డిప్రెషన్ వల్ల ఒకరి ప్రవర్తన ప్రమాదకరంగా మారుతుంది. ఆత్మహత్య వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకొనేలా చేస్తుంది. అయితే, ఒకరు మానసికంగా అనుభవించే బాధ డిప్రెషన్ గా ఎలా మారుతుంది? డిప్రెషన్ కు గురవడానికి గల కారణాలను, అలాగే దీనివల్ల వచ్చే సమస్యలను ఇప్పుడు తెలుసుకుందాం.. బాధ అనేది మనిషిని ఎదురించేలా చేస్తుంది. ఇది వారిలో ప్రతీకార స్వభావాన్ని పెంచుతుంది.. లేదంటే ఆ బాధే వారి మరణానికి కారణం అవుతుంది. ఒక వ్యక్తి జీవితంలో విషాదకరమైన సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు, వాటికి ప్రతిచర్యగా వారి మెదడు డిప్రెషన్ అనే స్థితిలోకి వెళ్తుంది. ఈ దశలో బాధితుల మనసంతా ప్రతికూలమైన ఆలోచనలతో నిండి ఉంటుంది.  ఆకలి వేయకపోవడం, నిద్ర పట్టకపోవడం డిప్రెషన్ యొక్క ప్రధాన లక్షణాలు. ఇది జీవితంపై పూర్తిగా నిరాశను కలుగజేస్తుంది. ఒక వ్యక్తి డిప్రెషన్ బారిన...

What is Habeas Corpus? (in Telugu) హెబియస్ కార్పస్ అంటే ఏమిటి?

Image
ఒక వ్యక్తి చట్టపరమైన నేరం చేస్తే అరెస్టు కాబడడం సహజం... అయితే, ఒకవేళ ఎలాంటి నేరం చేయకపోయినా అరెస్ట్ అయితే ఏం జరుగుతుంది? పోలీసులకు తలచుకుంటే ఎవరినైనా అరెస్టు చేయగలిగే అధికారం ఉంటుందా? ఒకవేళ మనం కూడా ఎప్పుడైనా అన్యాయంగా అరెస్ట్ అయితే ఏవిధంగా న్యాయం పొందాలి? మన భారత రాజ్యాంగంలో పొందుపరచిన 22వ ఆర్టికల్ ఏం చెబుతుంది, ఇంకా 'హెబియస్ కార్పస్' (HABEAS CORPUS) అనే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మన భారతదేశ రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ అనుసారం, ప్రతి వ్యక్తికీ సమాజంలో స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. ఇష్టానుసారంగా ప్రజల స్వేచ్చను హరించగలిగే అధికారం లేదా నిర్బంధించే హక్కు ఏ సంస్థలకూ, అధికారులకూ లేదు. 21వ ఆర్టికల్ కు బలం చేకూరే విధంగా 22వ ఆర్టికల్ ఇంకా 'హెబియస్ కార్పస్' అనే విధానాన్ని రాజ్యాంగంలోని 226వ ఆర్టికల్ లో చేర్చారు.. పోలీసులు గానీ వేరే ఇతర అధికారులు గానీ, ఒకరిని ఏ కారణం వల్లైనా అరెస్ట్ చేయాల్సి వస్తే, అలా చేసిన వెంటనే లేదా 24 గంటలలోపు సదరు వ్యక్తిని న్యాయస్థానం ఎదుట నిలబెట్టవలసి ఉంటుంది. దీనివల్ల ఒక వ్యక్తి చట్టపరంగానే అరెస్టు కాబడ్డాడా, లేక అన్యాయంగా అతన్ని అరెస్టు చేశార...

What is Psychology? & uses of Psychology (in Telugu) సైకాలజీ అంటే ఏమిటి?

Image
ఈ ప్రపంచంలో ఎంత గొప్పవారినైనా అన్నిటికంటే కష్టమైన పని ఏంటని అడిగితే... ఎదుటివారి మనసుని, ఆలోచనలని అర్థం చేసుకోవడం అని అంటారు. సాధారణంగా తల్లిదండ్రులకి పిల్లలనూ, టీచర్లకి విద్యార్థులనూ, వ్యాపారస్తులకి కస్టమర్లనూ అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే.. సైన్స్ లో మనసు, ఆలోచనలు ఇంకా భావోద్వేగాలు ఎలా పనిచేస్తాయో చెప్పే ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ ఉంది. అదే సైకాలజీ (PSYCHOLOGY). సైకాలజీ సబ్జెక్ట్ గురించిన విషయాలను, దీని ఉపయోగాలను ఇప్పుడు తెలుసుకుందాం.. సైకాలజీ పూర్తిగా మానవ మెదడు, ఇంకా దాని పనితీరుకు సంబంధించినది. వ్యక్తుల యొక్క ఆలోచనా విధానం, ఇంకా వారి ప్రవర్తన గురించి అధ్యయనం చేస్తే, దాన్నే సైకాలజీ (PSYCHOLOGY) అని అంటారు. అంటే, ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఏవిధంగా ప్రవర్తిస్తాడు, మనుషుల మధ్య ఉన్నప్పుడు ఏవిధంగా ప్రవర్తిస్తాడు అనే విషయాలను సైకాలజీలో ప్రధానంగా చర్చిస్తారు. దీనితోపాటు ఒక వ్యక్తి యొక్క భావోద్వేగాలను, వాటికి గల కారణాలను, మానసిక పరిస్థితిని, వ్యక్తిత్వాన్ని కూడా సైకాలజీలో అధ్యయనం చేస్తారు. ఒకరి శారీరక ఆరోగ్యం వారి యొక్క మానసిక పరిస్థితులపై ఏవిధంగా ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని సై...

Puvvullona Vikasinche (Telugu Love Song) | Ram Prasad K S V N S

Image
♥️🥰 There is only one thing which is purely magical in this world... It's Love.. 😍😘 Let's celebrate the magic of #Love 👩‍❤️‍👨❤️💏 ♥️🥰 ఈ ప్రపంచంలో అన్నిటికంటే విచిత్రమైనది ఏదైనా ఉందంటే, అది ప్రేమ ఒక్కటే.... 😍😘 #Prema #Telugu #PuvvullonaVikasinche

Why Dreams occur in sleep? (in Telugu) నిద్రలో కలలు ఎందుకు వస్తాయి?

Image
చాలా మందికి తరచుగా వచ్చే సందేహం... మన కలల్లో కనిపించేవన్నీ నిజంగా జరుగుతాయా, లేక కలలనేవి కేవలం మన ఊహలు మాత్రమేనా? కలలు మనకు తెలియని వేరొక అద్భుతమైన ప్రపంచానికి ద్వారాలా? కొన్ని సార్లు కలలు ఎంత మధురంగా ఉంటాయో, మరికొన్ని సార్లు అంతే భయంకరంగా ఉంటాయి. ఇంతకీ, మనకు నిద్రలో కలలు ఎందుకు వస్తాయి? కలల గురించి ఉన్న కొన్ని వాస్తవాలని ఇప్పుడు తెలుసుకుందాం.. నిద్రలో కలలు ఎందుకు వస్తాయన్నదానిపై పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కలలనేవీ కేవలం మెదడుకి సంబంధించినవని కొంతమంది చెబితే, ఆత్మకు సంబంధించినవని మరికొందరు చెబుతారు. ముందుగా, సైన్స్ కలల గురించి ఏ విధంగా చెప్తుందో చూద్దాం.. సాధారణంగా మనం పడుకున్నప్పుడు, శరీరం రెండు దశల్లో నిద్రలోకి వెళ్తుంది. మొదటిది, RAPID EYE MOVEMENT లేదా REM అనే దశ. ఈ దశలో శరీరంలోని అవయవాలు విశ్రాంతి తీసుకుంటున్నా, మెదడులోని ఆలోచనలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. రెండోది, NON RAPID EYE MOVEMENT లేదా N-REM అనే దశ. ఈ దశలో మెదడులోని ఆలోచనలు కూడా పూర్తిగా స్తంభిస్తాయి. దీన్నే గాఢ నిద్ర అని కూడా పిలుస్తారు. కలలనేవి మొదటిదైన RAPID EYE MOVEMENT దశలో మాత్రమే వస్తాయి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు క...

Why Lightning occurs? (in Telugu) పిడుగులు ఎందుకు పడతాయి?

Image
పిడుగులు... ఇవి ఆకాశంలో మెరిసేటప్పుడు ఎంత అద్భుతంగా కనిపిస్తాయో, పడేటప్పుడు అంత భయంకరంగా ఉంటాయి. ఒక్క భారతదేశంలోనే ఏటా సుమారు వేయి మందికి పైగా పిడుగుల బారినపడి మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకూ, కనీసం వంద పిడుగులు నేలపై పడుతూ ఉంటాయి. ఐతే, పిడుగులు ఎందుకు పడతాయి, ఎలాంటి ప్రదేశాల్లో పడతాయి, వీటి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పిడుగు, లేదా LIGHTNING అనేది మేఘాల నుండీ భూ ఉపరితలాన్ని తాకే అతి శక్తివంతమైన విద్యుత్ ప్రవాహం. మేఘాల నుండీ విద్యుత్ ఎలా పుడుతుందని మీరు సందేహపడొచ్చు. సాధారణంగా వాతావరణం చల్లబడినప్పుడు, మేఘాలలో ఉన్న నీరు ద్రవ ఇంకా ఘన పదార్థాలగా మారుతుంది. వీటికి బలమైన గాలులు తోడైనప్పుడు, నీరు ఇంకా మంచు బిందువులు మధ్య రాపిడి ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన రాపిడి వల్ల, మేఘాలలో కొన్ని వేల కోట్ల పాజిటివ్ ఇంకా నెగటివ్ ఛార్జ్ లు స్తృష్టించబడతాయి. ఈ పాజిటివ్ ఇంకా నెగటివ్ ఛార్జ్ లు ఒకదానిని మరొకటి ఆకర్షించుకున్నప్పుడు అమితమైన విద్యుత్ శక్తి ఇంకా వేడి పుడుతుంది. దీన్నే పిడుగు, లేదా LIGHTNING అని పిలుస్తారు. ఒక్కో పిడుగు సమారు 30 కోట్ల వోల్...

What are Hormones? (in Telugu) హార్మోన్స్ అంటే ఏమిటి?

Image
మానవ శరీరం వివిధ రసాయనాలు, లేదా CHEMICALS తో తయారైన ఒక వ్యవస్థ.. ప్రపంచంలో సుమారు 800 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నపప్టికీ ఏ ఇద్దరి శరీరాలు, ఆరోగ్యం ఒకే రకంగా ఉండవు.. ఒక మనిషి యొక్క రూపూ, బరువూ, ఆరోగ్యం దేనిమీద ఆధారపడి ఉంటాయి? స్త్రీ పురుషుల యొక్క శారీరక పెరుగుదల ఎందుకు విభిన్నంగా జరుగుతుంది? వీటిని అర్థం చేసుకోవాలంటే మానవ శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ అనే వాటి గురించి తెలుసుకోవాలి.. హార్మోన్స్ అంటే ఏంటి? శరీరంలో అవి ఏవిధంగా పనిచేస్తాయి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం... మానవ శరీరం జీవించడానికి గాలి, నీరు, ఆహారం వంటివి తీసుకొని, వాటి ద్వారా శక్తిని గ్రహిస్తుంది. అదే విధంగా ఆరోగ్యంగా ఉండడానికి నిద్ర, శారీరక శ్రమ, మానసిక ఆనందం అనే వాటిని కూడా పొందుతుంది. ఈ మొత్తం ప్రక్రియను జీవక్రియ లేదా METABOLISM అని అంటారు. జీవక్రియ ను నియంత్రించడానికి శరీరంలోని అవయవాలు హార్మోన్స్ అనే జీవ రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. హార్మోన్స్ శరీరావయవాలలో ఉండే వివిధ గ్రంధుల ద్వారా విడుదల అవుతూ ఉంటాయి. శరీర పెరుగుదలకు, అవయవాల అభివృద్ధికి, సంతానోత్పత్తికి హార్మోన్స్ ఎంతో అవసరం. శరీరంలో జరిగే ఒక్కో చర్యను ఒక్క...

What is an Operating System? (in Telugu) ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమిటి?

Image
ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి స్మార్ట్ పరికరాల వాడకం చాలా సులభతరంగా మారింది.. కేవలం వీటి స్క్రీన్ పై టచ్ చెయ్యడం ద్వారానో, లేదా మాటల సంకేతాల ద్వారానో మనకి కావలసిన వినోదాన్ని, సేవలని పొందగలుగుతున్నాం... ఇది ఎలా సాధ్యమైంది?!... మనం దీని గురించి తెలుసుకోవాలంటే, ముందుగా ఆపరేటింగ్ సిస్టమ్ అనే దాని గురించి తెలుసుకోవాలి.. అంటే... ఉదాహరణకు కంప్యూటర్లలో కనిపించే విండోస్, స్మార్ట్ ఫోన్లలో కనిపించే ఆండ్రాయిడ్, ఐ ఓ ఎస్ అనేవాటి గురించి తెలుసుకోవాలి... ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? అదెలా పనిచేస్తుంది అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. మనం వాడే ఫోన్, కంప్యూటర్, టీవీ మొదలైన స్మార్ట్ పరికరాలు వివిధ రకాల హార్డ్ వేర్ భాగాలతో నిర్మించబడతాయి... హార్డ్ వేర్ భాగాలంటే.. స్క్రీన్, కీబోర్డ్, కెమెరా, స్పీకర్, మదర్ బోర్డ్ మొదలైనవి.. ఈ భాగాలన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా సంక్లిష్టమైన విధానాలతో తయారవుతాయి... ఓ పరికరం సరిగ్గా పనిచేయాలంటే ఈ హార్డ్ వేర్ భాగాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి పనిచేయాలి... అంతే కాకుండా, ఇవి మనమిచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలి.. ఇలా వీటన్నిటినీ కలిపి పనిచేయించడాన...

What is Mutual Funds? (in Telugu) మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

Image
మీరు ఒక ఇన్వెస్టర్ లా మారాలని అనుకుంటున్నారా?మీ డబ్బులను ఎలాంటి రిస్క్ లేకుండా, సురక్షితంగా INVEST చేసి, లేదా పెట్టుబడిగా పెట్టి లాభాలను పొందాలనుకుంటున్నారా? అయితే, మ్యూచువల్ ఫండ్స్ మీకొక సులభమైన మార్గం.. ఇంతకీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? అదెలా పనిచేస్తుంది? పెట్టుబడులు పెట్టడానికి ఇదెందుకు సురక్షితమైన మార్గమో ఇప్పుడు తెలుసుకుందాం... ఒకరు నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం, లేదా షేర్లను కొనడం వల్ల, రిస్క్ శాతం ఎక్కువగా ఉంటుంది.. షేర్లని ఏవిధంగా కొనాలి, ఏ విధంగా అమ్మాలో తెలియక గందరగోళానికి గురి అవుతారు.. మ్యూచువల్ ఫండ్స్ కూడా పెట్టుబడుల ఆధారంతో లాభాలు పొందడానికి సహాయపడే ఒక మార్గం.. అయితే, ఇందులో మనం పెట్టుబడులు పెట్టిన తర్వాత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. మన డబ్బులు సురక్షితంగా మధ్య వ్యక్తుల చేతుల్లో ఉంటాయి.. ఈ మధ్య వ్యక్తులే మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు.. ఉదాహరణకు, SBI MUTUAL FUND, ICICI PRUDENTIAL MUTUAL FUND, AXIS MUTUAL FUND మొదలైనవి.. మనం పడాల్సిన రిస్క్ అంతా వీళ్ళే పడి, స్టాక్ మార్కెట్లో లాభాల దిశగా పయనిస్తున్న షేర్లను కొని అమ్ముతూ ఉంటారు.. ఇన్వెస్టర్లు తమ వద్ద పెట్టుబడిగా...

What is Law of Karma? (in Telugu) కర్మ సిద్ధాంతం

Image
ఏ మనిషైనా కోరుకునేది ఒక్కటే.. ఎలాంటి కష్టాలు, బాధలు లేని జీవితం.. అయితే, కోరుకున్న ఉద్యోగం వస్తేనో, కావలసినంత డబ్బు సంపాదిస్తేనో మన కష్టాలన్నీ తీరిపోతాయి అనుకోవడం పెద్ద పొరపాటు.. మన ఆలోచనా విధానం, చేసే పనులు.. ఈ రెండిటి ఆధారంగానే, మన జీవితం నిర్ణయించబడి ఉంటుంది.. ఈ నిజాన్ని అద్భుతంగా వివరించే ఒక ఆధ్యాత్మిక నమ్మకమే కర్మ సిద్ధాంతం. ఇంతకీ కర్మ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఒకరి కోరికలను బట్టే, వారి చేష్టలు ఉంటాయి.. చేష్టలను బట్టే అలవాట్లు ఉంటాయి.. అలవాట్లను బట్టే ప్రవర్తన ఉంటుంది.. ఆ ప్రవర్తనే అతని జీవితాన్ని మారుస్తుంది... కనుక ఒక వ్యక్తి ఎలంటివాడు, అతని జీవితం ఎలా ఉండబోతోంది అన్నది, అతని కోరికలను బట్టి చెప్పొచ్చు.. మన జీవితంలో ప్రస్తుతం జరిగే ప్రతిదానికీ కారణం, మనం గతంలో చేసిన ఆలోచనలు, ఎంపికలు, పనులు, ఇంకా చేష్టలు.. కర్మ అనే పదానికి అర్థం... పని, అలవాటు లేదా చేష్ట. ఇది దేవుడికి సంబంధించిన విషయం కాదు.. మానవ జీవితం, ఇంకా నైతిక విలువలకు సంబంధించింది.. అయితే, మనం చేసే అన్ని పనులూ కర్మలు కావు.. కేవలం ఉద్దేశపూర్వకంగా చేసిన పనులు మాత్రమే కర్మలవుతాయి. మన జీవితాలలో ఇదివ...

What is Positive Thinking? (in Telugu) పాజిటివ్ థింకింగ్ అంటే ఏమిటి?

Image
ఇంటర్నెట్‌లో సాధారణంగా అడిగే ఒక ప్రశ్న, "పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి?" లేదా "పాజిటివ్‌గా ఎలా ఆలోచించాలి?". మనం ఆలోచించే విధానమే మన జీవితంలో ప్రతిదాన్ని నిర్ణయిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదాహరణకు, తరచూ చిరాకు పడే ఒక వ్యక్తి, తాను నిరుత్సాహంగా ఉండడమే కాక, చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా నిరుత్సాహపరుస్తాడు. అదే విధంగా, ఎప్పుడూ హుషారుగా పనిచేసే ఒక వ్యక్తి, తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ ఉత్సాహపరుస్తాడు. ఒకరి ఆలోచనలు ఏ విధంగా ఉంటే, వారి ఆరోగ్యం కూడా అదే విధంగా ఉంటుంది. భావోద్వేగాలను, ఒత్తిడిని అధిగమించి శాంతంగా జీవించడానికి సహాయపడే ఆలోచనా విధానాన్నే పాజిటివ్ థింకింగ్ అని అంటారు. పాజిటివ్ థింకింగ్ మనల్ని మానసికంగా బలంగా చేస్తుంది. ఇబ్బందులను ఉత్సాహంతో ఎదుర్కోవడంలో మనకు సహాయపడుతుంది. ఇంతకీ పాజిటివ్ గా ఆలోచించడం ఎలా? .... ఒకవేళ మిమ్మల్ని ఎవరో ఒక వ్యక్తో, ఏదో ఒక విషయమో బాధపెడుతుంటే, దాని నుండీ మీ దృష్టి మరాల్చుకోవడానికి ప్రయత్నించండి.. బాధ పడటం వల్ల, మీరు మీ పని సక్రమంగా చేయలేరని గుర్తుపెట్టుకోండి.. అనవసరమైన ఆలోచనల వల్ల, మీ సంతోషానికి మీరు దూరమవుతారు.. కాస్త విశ్రాంతి తీసుక...

What is Internet and how it works? (in Telugu) ఇంటర్నెట్ అంటే ఏమిటి?

Image
సరిగ్గా 20 ఏళ్ల ముందు వరకు, ముఖ్యమైన సమాచారాన్ని చేరవేయడానికి ఉత్తరాలు రాసేవారు. కానీ ఇప్పుడు వాటికి బదులు, మనం E mail, Whatsapp, Messenger వంటి సదుపాయాలు వాడుతున్నాం. మనకి ఇష్టమైన సినిమాలు, థియేటర్ కి వెళ్లి చూసే అవసరం లేకుండా, నేరుగా మన స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీదనే చూస్తున్నాం.. గంటలు, రోజుల తరబడి చేసే పనులను, నిమిషాల వ్యవధిలో చెయ్యగలుగుతున్నామ్. వీటన్నిటికీ కారణం, INTERNET. ఇంతకీ ఇంటర్నెట్ ఆంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. ఏ రకమైన సమాచారాన్నైనా డాక్యుమెంట్ల రూపంలోనో, ఫోటోలు, వీడియోలు, ఆడియోల రూపంలోనో ఒక కంప్యూటర్లో నిక్షిప్తం చెయ్యొచ్చు.. ఈ విధంగా మన చుట్టూ కొట్లకొద్ది కంప్యూటర్ల లోనూ, మొబైల్ ఫోన్లలోనూ నిరంతరం సమాచారం నిక్షిప్తం అవుతూ ఉంది.. ఈ సమాచారం మొత్తాన్ని బహిర్గతం చేసి, అందరూ ఉపయోగించుకొనేలా చేస్తే, అప్పుడు అది WORLD WIDE WEB లేదా www అనే సాంకేతిక వ్యవస్థలో చేరుతుంది.. ఈ WORLD WIDE WEB లో ఉన్న సమాచారాన్ని పొందడానికి మనకి ఉపయోగపడేదే INTERNET. ప్రపంచ నలుమూలల నుండీ మనకి కావలసిన సమాచారాన్ని క్షణాల్లో పొందడానికి సహాయపడుతుంది. వేర్వేరు వ్యక్తిగత, సామాజిక,...

Dhyana Yoga (in Telugu) ధ్యానయోగం

Image
🌻🌄🌼 Dhyana Yoga | Morals extracted from Shri Bhagavad-Gita (in Telugu) | Lord Krishna's Bhagavad Gita in Telugu | Motivational Words in Telugu #BhagavadGita #DhyanaYoga #LordKrishna #TeluguEd ధ్యాన యోగం • శ్రీమద్ భగవద్గీత నుండి గ్రహించిన నీతి వాక్యాలు • శ్రీకృష్ణుడు చెప్పిన హితబోధ • ఉత్తేజభరిత వచనాలు.

What is Potential Energy & Kinetic Energy? (in Telugu) పోటెన్షియల్ ఇంకా కైనెటిక్ ఎనర్జీ

Image
What is Potential Energy? What is Kinetic Energy? How Potential Energy converts into Kinetic Energy? • 10th Class • Physical Science • Force Work & Energy • Relation between Mass and Velocity of Object • K.E & P.E • Rest and Motion • Energy loaded in Spring • Newton's Laws of Motion #Energy #PhysicalScience #10thClass పోటెన్షియల్ & కైనిటిక్ ఎనర్జీ అంటే ఏమిటి? • 10వ తరగతి • భౌతిక శాస్త్రం • ఫోర్స్, వర్క్ & ఎనర్జీ • మాస్ మరియు వెలాసిటీ కి ఉన్న సంబంధం • న్యుటన్స్ లాస్ ఆఫ్ మోషన్

How Brain Works? (in Telugu) మానవ మెదడు ఎలా పనిచేస్తుంది? 🧠📖🤔

Image
How Brain Works? Working of Human Brain | Parts of Human Brain | How brain controls our body functions? What is Intelligence? What is Consciousness? Central Nervous System | Biology | Human Body | Sense Organs | Control and Coordination | Stimulus and Response | Functioning of Human Brain | Cerebrum, Cerebellum & Brain Stem #Health #TeluguEd #HumanBrain #NervousSystem మానవ మెదడు ఎలా పనిచేస్తుంది? మానవ మెదడులోని భాగాలు | మెదడు మన శరీరాన్ని ఎలా నియంత్రిస్తుంది? మేధస్సు అంటే ఏమిటి? స్పృహ అంటే ఏమిటి? నరాల వ్యవస్థ | సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ | జీవశాస్త్రం | మానవ శరీరం | జ్ఞానేంద్రియాలు | కంట్రోల్ ఇంకా కో ఆర్డినేషన్ | సెరిబ్రం, సెరిబెళ్ళం & బ్రెయిన్ స్టెమ్

Parts Of Speech | English Grammar (in Telugu) | పార్ట్స్ ఆఫ్ స్పీచ్

Image
Parts of Speech (in Telugu) | English Grammar Lessons | 8 Parts of Speech | Noun, Pronoun, Verb, Adverb, Adjective, Conjunction, Interjection, Preposition | Importance of Parts of Speech in Sentence construction | Spoken English in Telugu #EnglishLessons #Grammar #TeluguEd ఇంగ్లీష్ గ్రామర్ | పార్ట్శ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏమిటి? | వ్యాఖ్య నిర్మాణంలో పార్ట్శ్ ఆఫ్ స్పీచ్ ఎలా ఉపయోగపడుతుంది?

What is Democracy, and why is it important? (in Telugu) ప్రజాస్వామ్యం ఎలా ఉపయోగపడుతుంది? 👆🏻✊🏻🗣️👥✒️

Image
What is Democracy? Importance of Democracy • Why Democracy is the best form of Government? • Why is Democracy important? What is Democratic form of Government? • Ruling System • 10th AP Telangana Social Studies • Why India is a Democratic Country • Facts about Democracy • How Democracy Started? • Right to Vote • Universal Adult franchise • Qualities of a leader • #Democracy #Government #Law #India ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజాస్వామ్యం ఎందుకు ముఖ్యమైనది? ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ఏమిటి? పరిపాలన వ్యవస్థ • 10వ తరగతి ఆంధ్ర, తెలంగాణ సాంఘిక శాస్త్రం • ఎందుకు భారత దేశంలో ప్రజాస్వామ్యం ఎంచుకోబడింది? • డెమోక్రసీ • ఓటు హక్కు • ప్రజాస్వామ్యం ఎలా ఉపయోగపడుతుంది? • ప్రజాస్వామ్య పాలన ఎందుకు అన్నిటికంటే ముఖ్యమైనది? • గొప్ప నాయకులకుండే లక్షణాలు • నాయకులను ఎవరు నిర్ణయిస్తారు? ఒక దేశంలోని ప్రజలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి సమర్ధవంతమైన నాయకులు అవసరం. సమర్ధవంతమైన నాయకులు రావాలంటే దేశంలో డెమోక్రసీ లేదా ప్రజాస్వామ్యం అమలు చెయ్యాలి. ఇంతకీ డెమోక్రసీ అంటే ఏంటి?, అది మనకు ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో ...

How to become an Entrepreneur? (in Telugu) వ్యవస్థలను ఎలా నిర్మించాలి 🏢💵💰📈

Image
ఒక సొంత వ్యాపారాన్ని మొదలుపెట్టి, విస్తరింపజేసి, లాభాలు పొందడం అనేది ఎంతో కష్టంతోనూ, రిస్క్ తోనూ కూడుకున్న పని.. అయితే, మన ప్రపంచంలో తమ సొంత వ్యాపారాలను మొదలుపెట్టి, ఒడిదుడుకులను తట్టుకొని, ఈనాడు కోటీశ్వరులుగా ఎదిగిన వాళ్లు ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు.. వ్యాపార రంగంలో స్థిరపడాలంటే ఎందుకు తగిన చురుకుదనం, నేర్పరితనం మనలో ఉండాలి.. వ్యవస్థలను స్థాపించడానికి, కొనసాగించడానికి బలమైన నాయకులు అవసరం.. వీళ్లనే entrepreneurs అని అంటారు.. మరి, ఇలాంటి వాళ్లకుండే లక్షణాలేంటి? ఒక Entrepreneur లాగా ఎదగాలంటే ఏంచెయ్యాలో ఈ వీడియో లో తెలుసుకుందాం.... మీకు మీరే ఒక సొంత బాస్ గా ఎదగాలంటే ముందుగా మీరొక బాధ్యతగల వ్యక్తిగా మారాల్సి ఉంటుంది.. ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి మీరేమీ కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరిదివరకే బాగా నేర్చుకున్న పనిని, ఒక వృత్తి గా మార్చుకుంటే చాలు. అంటే, ఎదో ఒక పనిలో మీకు అనుభవం ఉండాలి. ఉదాహరణకు, మీకు ఫోటోగ్రఫీ లో ఎక్కువ అనుభవం ఉందనుకోందాం.. అప్పుడు మీరు ఒక ఫోటో గ్యాలరీని స్టార్ట్ చేసి మీరు తీసిన ఫొటోలను అమ్మడానికి ప్రయత్నించవచ్చు. తొందరపడి ఎదో ఒకటి ప్రయత్నించడం కంటే, ముందుగా అనుభవ...

Karma Yoga (in Telugu) కర్మయోగం

Image
నువ్వు అనుకోవచ్చు మిత్రమా.. ఏదీ శాశ్వతం కాని ఈ జీవితంలో ఎందుకిన్ని సమస్యలు, పోరాటాలు అని.. ఈ ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు తమ దగ్గర లేని వాటిలో సంతోషం వెతికితే, మరొకరు తనదగ్గర ఉన్నవాటితో సంతోష పడతారు. ఆశ... ఈ సమాజంలో జరిగే ప్రతిదానికీ కారణం. అలాగని నువ్వు దేనిమీదా ఆశ పడనంత మాత్రాన సంతోషం నిన్ను వెతుక్కుంటూ వస్తుందని నేను చెప్పలేను. నువ్వు ఎప్పుడు పుట్టావ్, ఎక్కడ ఉన్నవ్, ఎలా బ్రతుకుతున్నావ్... అన్నీ ప్రకృతే నిర్ణయించింది. ఇది ఒక పోరాటం. నీ బ్రతుకు కోసం నువ్వు చేసే ఒక పోరాటం... నీ పోరాటం మీద ధ్యాస పెట్టు. కొరికలమీద కాదు.. నువ్వు పోరాడాలి.. నీ బ్రతుకు కోసం పోరాడాలి.. నువ్వు బ్రతకాలి.. నీ సమస్యలు తట్టుకోవడానికి బ్రతక్కలి.. నువ్వు పోరాడేది నిన్ను నువ్వు బలంగా తయారు చేసుకోవడానికని గుర్తుపెట్టుకో.. నువ్వు కావలసినంత బలంగా తయారైనప్పుడు ఎంతో ఉన్నతంగా బ్రతకగలవు... ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగలవు. కాబట్టి, ఈ ప్రకృతితో కలసి పోరాడు. ప్రకృతిని నువ్వు అర్థం చేసుకోగలిగినప్పుడు అది నీ శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుంది. నీ పోరాటంలో నీకు సహాయపడుతున్న ప్రతిదానికీ నువ్వు కృతజ్ఞత చూపించు....

How the Days of the Week got their names? (in Telugu) వారాలకు సోమ, మంగళ, బుధ మొదలైన పేర్లు ఎలా వచ్చాయి? 📆📝📖📌

Image
How the Days of the Week got their names? (in Telugu) వారాలకు సోమ, మంగళ, బుధ మొదలైన పేర్లు ఎలా వచ్చాయి? 📆📝📖📌 How the days of the week got their names? (in Telugu) | How Sun, Mon, Tue, Wed, Thurs, Fri, Sat days came? History of Calendar | Why week have 7 days (in Telugu) | Relation between planets and days of a week | 7 days of a week in Telugu | Why 7 days of a week called differently in different languages? #Calendar #DaysOfTheWeek #History #Telugu వారంలో రోజులకు ఆ పేర్లు ఎలా వచ్చాయి? ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని వారాలకు ఆ పేర్లు ఎలా పెట్టారు? క్యాలెండర్ యొక్క చరిత్ర | వారంలో ఏడు రోజులు ఎందుకు ఉన్నాయి? సౌర కుటుంబంలో గ్రహాలకు, వారాల పేర్లు ఉన్న సంబంధం | ఎందుకు వారంలో రోజులను వివిధ భాషల్లో వివిధ పేర్లతో పిలుస్తారు?

What is Balanced Diet? (in Telugu) బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏమిటి? 🍎🍞🍗🥣

Image
What is Balanced Diet? What are Nutrients? Importance of Balanced Diet? What are Nutrient Rich Foods? What is zunk food? How Balanced diet makes us healthy? Healthy eating habits | Health Tips | How to Eat and Stay Healthy? Healthy Food Habits | Vegetables and Fruits that have high nutrients #BalancedDiet #Health #Nutrition #Telugu బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏమిటి? పోషకాలు అంటే ఏమిటి? బ్యాలెన్స్డ్ డైట్ పాటించడం వల్ల ప్రయోజనాలు | పోషకాలు ఎక్కువగా ఉండే తిండి పదార్థాలు | జంక్ ఫుడ్ అంటే ఏంటి? బ్యాలెన్స్డ్ డైట్ మనల్ని ఆరోగ్యంగా ఎలా ఉంచుతుంది? ఆరోగ్యకరమైన తిండి అలవాట్లు | ఆరోగ్య సూత్రాలు | ఏ ఏ తిండి పదార్థాల్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి?

History of Indian National Anthem (in Telugu) భారత జాతీయ గీతం యొక్క చరిత్ర ✍🏻🙏🏻🇮🇳

Image
History of Indian National Anthem in Telugu | How Jana Gana Mana became Indian National Anthem | Who wrote Jana Gana Mana | Rabindranath Tagore's Jana Gana Mana | Indian Freedom Movement | Facts about Indian National Anthem in Telugu | Meaning of National Anthem in Telugu #India #JanaGanaMana #NationalAnthem #Telugu భారత జాతీయ గీతం యొక్క చరిత్ర | జన గణ మన జాతీయ గీతంగా ఎలా మారింది? | జన గణ మన ఎవరు వ్రాసారు? రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క జన జన మన గీతం | భారత స్వాతంత్ర ఉద్యమం | భారత జాతీయ గీతం గూర్చిన విశేషాలు | జన గణ మన పాటకు అర్థం

What is Kaliyuga? Effects of Kaliyuga (in Telugu) కలియుగం అంటే ఏమిటి? 🧐⏳🌀🌪️📝

Image
What is Kaliyuga? Kaliyuga facts in Telugu | How and Why Kaliyuga started? Kaliyuga explained in Telugu | Kaliyugam | Yugas explained in Telugu | How Kaliyuga will end? Kaliyuga Timeline in Telugu | Kaliyuga according to Mahabharata | How Lord Krishna explained Kaliyuga? Hinduism facts in Telugu #Kaliyuga #TeluguFacts #Mahabharata #Hinduism కలియుగం అంటే ఏమిటి? కలియుగం విశేషాలు | కలియుగం ఎలా ఎందుకు మొదలైంది? కలియుగం గురించిన విషయాలు తెలుగులో | యుగాలంటే ఏమిటి? కలియుగం ఎలా ముగుస్తుంది? మహాభారతం  ప్రకారం కలియుగం ఎలా వివరించబడింది? శ్రీకృష్ణుడు కలియుగం గురించి ఏమని చెప్పాడు? హిందూ మత విశేషాలు

Greatness of India (in Telugu) భారతదేశ గొప్పదనం 🇮🇳🙏🏻🌼

Image
What is greatness of India? (in Telugu) | Facts about India (in Telugu) | Independence Day & Republic Day speech (in Telugu) | Why India is Great? Why India is a developing country? Why India is an agricultural country? What is Unity in Diversity? (in Telugu) | Why India is a democratic country? About India in Telugu #India #UnityInDiversity #Culture #Traditions #Agriculture #Democracy  భారత దేశ గొప్పదనం ఏమిటి? స్వాతంత్ర్య గణతంత్ర దినోత్సవ ప్రసంగం | ఎందుకు భారతదేశం గొప్పది? ఎందుకు భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం? ఎందుకు భారత్ వ్యవసాయ దేశం? భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏమిటి? ఎందుకు భారత్ ప్రజాస్వామ్య దేశం?