How to become an Entrepreneur? (in Telugu) వ్యవస్థలను ఎలా నిర్మించాలి 🏢💵💰📈
ఒక సొంత వ్యాపారాన్ని మొదలుపెట్టి, విస్తరింపజేసి, లాభాలు పొందడం అనేది ఎంతో కష్టంతోనూ, రిస్క్ తోనూ కూడుకున్న పని.. అయితే, మన ప్రపంచంలో తమ సొంత వ్యాపారాలను మొదలుపెట్టి, ఒడిదుడుకులను తట్టుకొని, ఈనాడు కోటీశ్వరులుగా ఎదిగిన వాళ్లు ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు.. వ్యాపార రంగంలో స్థిరపడాలంటే ఎందుకు తగిన చురుకుదనం, నేర్పరితనం మనలో ఉండాలి.. వ్యవస్థలను స్థాపించడానికి, కొనసాగించడానికి బలమైన నాయకులు అవసరం.. వీళ్లనే entrepreneurs అని అంటారు.. మరి, ఇలాంటి వాళ్లకుండే లక్షణాలేంటి? ఒక Entrepreneur లాగా ఎదగాలంటే ఏంచెయ్యాలో ఈ వీడియో లో తెలుసుకుందాం.... మీకు మీరే ఒక సొంత బాస్ గా ఎదగాలంటే ముందుగా మీరొక బాధ్యతగల వ్యక్తిగా మారాల్సి ఉంటుంది.. ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి మీరేమీ కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరిదివరకే బాగా నేర్చుకున్న పనిని, ఒక వృత్తి గా మార్చుకుంటే చాలు. అంటే, ఎదో ఒక పనిలో మీకు అనుభవం ఉండాలి. ఉదాహరణకు, మీకు ఫోటోగ్రఫీ లో ఎక్కువ అనుభవం ఉందనుకోందాం.. అప్పుడు మీరు ఒక ఫోటో గ్యాలరీని స్టార్ట్ చేసి మీరు తీసిన ఫొటోలను అమ్మడానికి ప్రయత్నించవచ్చు. తొందరపడి ఎదో ఒకటి ప్రయత్నించడం కంటే, ముందుగా అనుభవ...