How to become an Entrepreneur? (in Telugu) వ్యవస్థలను ఎలా నిర్మించాలి 🏢💵💰📈
ఒక సొంత వ్యాపారాన్ని మొదలుపెట్టి, విస్తరింపజేసి, లాభాలు పొందడం అనేది ఎంతో కష్టంతోనూ, రిస్క్ తోనూ కూడుకున్న పని..
అయితే, మన ప్రపంచంలో తమ సొంత వ్యాపారాలను మొదలుపెట్టి, ఒడిదుడుకులను తట్టుకొని, ఈనాడు కోటీశ్వరులుగా ఎదిగిన వాళ్లు ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు..
వ్యాపార రంగంలో స్థిరపడాలంటే ఎందుకు తగిన చురుకుదనం, నేర్పరితనం మనలో ఉండాలి..
వ్యవస్థలను స్థాపించడానికి, కొనసాగించడానికి బలమైన నాయకులు అవసరం..
వీళ్లనే entrepreneurs అని అంటారు..
మరి, ఇలాంటి వాళ్లకుండే లక్షణాలేంటి?
ఒక Entrepreneur లాగా ఎదగాలంటే ఏంచెయ్యాలో ఈ వీడియో లో తెలుసుకుందాం....
మీకు మీరే ఒక సొంత బాస్ గా ఎదగాలంటే ముందుగా మీరొక బాధ్యతగల వ్యక్తిగా మారాల్సి ఉంటుంది..
ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి మీరేమీ కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు.
మీరిదివరకే బాగా నేర్చుకున్న పనిని, ఒక వృత్తి గా మార్చుకుంటే చాలు.
అంటే, ఎదో ఒక పనిలో మీకు అనుభవం ఉండాలి.
ఉదాహరణకు, మీకు ఫోటోగ్రఫీ లో ఎక్కువ అనుభవం ఉందనుకోందాం.. అప్పుడు మీరు ఒక ఫోటో గ్యాలరీని స్టార్ట్ చేసి మీరు తీసిన ఫొటోలను అమ్మడానికి ప్రయత్నించవచ్చు.
తొందరపడి ఎదో ఒకటి ప్రయత్నించడం కంటే, ముందుగా అనుభవం సంపాదించుకోండి.
మీరు మొదలుపొట్టబోయే వ్యాపారానికి సమాజంలో తగినంత డిమాండ్ ఉందా లేదా కనుక్కోండి.
మీకు ఎంతగొప్ప టాలెంట్ ఉన్నా, దానికి తగినంత డిమాండ్ లేకపోతే, మీరు వేరే అవకాశాల పైన దృష్టి పెట్టాలి.
మీ ఆలోచనలను ముందుగా మీ కుటుంబ సభ్యులతో చర్చించి, వారి సలహాలను కూడా తీసుకోండి.
చక్కగా మాట్లాడడం, ఎదటివారి భావాలను అర్థం చేసుకోవడం, వ్యాపారంలో చాలా ముఖ్యం.
ఎన్ని విమర్శలు వచ్చినా చిరునవ్వుతో స్వీకరించగలిగే మనస్తత్వం ఉండాలి..
మీకెదురయ్యే సమస్యలని తెలివితేటలతో పరిష్కరించుకొగలగాలి.
మీరు వ్యాపార రంగంలో స్థిరపడాలంటే ముఖ్యంగా తెలుసుకోవలసినవి, మీ బలాలు, ఇంకా బలహీనతలు.
మీ బలాలను క్రమంగా పెంచుకుంటూ, బలహీనతలను ఇతరులకు తెలియకుండా కాపాడుకోవాలి.
వ్యాపారంలో ఏదీ ప్లాన్ ప్రకారంగా జరగదు. సమయానుకూలంగా అవసరమైన మార్పులు చెయ్యడం ఎంతో అవసరం.
ఇందులో లాభనష్టాలన్నవి సహజం. లాభాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా పొదుపు చేసుకోవడంతో పాటు, నష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా భరించగలగాలి.
కస్టమర్లు ఎప్పుడూ నాణ్యతనే కోరుకుంటారు. మీరు నాణ్యమైన సేవను అందించినప్పుడు వ్యాపారం విస్తరిస్తుంది.
మీకు కావాల్సిందల్లా ఒక గొప్ప ఐడియా.. ఇంకా, ఆ ఐడియాను డబ్బుగా మార్చగలిగే పట్టుదల.
ఈ రెండూ ఉంటే, మీరు కూడా ఒక గొప్ప Entrepreneur గా మారగలరు.