What is Democracy, and why is it important? (in Telugu) ప్రజాస్వామ్యం ఎలా ఉపయోగపడుతుంది? 👆🏻✊🏻🗣️👥✒️

What is Democracy? Importance of Democracy • Why Democracy is the best form of Government? • Why is Democracy important? What is Democratic form of Government? • Ruling System • 10th AP Telangana Social Studies • Why India is a Democratic Country • Facts about Democracy • How Democracy Started? • Right to Vote • Universal Adult franchise • Qualities of a leader •

#Democracy #Government #Law #India

ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజాస్వామ్యం ఎందుకు ముఖ్యమైనది? ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ఏమిటి? పరిపాలన వ్యవస్థ • 10వ తరగతి ఆంధ్ర, తెలంగాణ సాంఘిక శాస్త్రం • ఎందుకు భారత దేశంలో ప్రజాస్వామ్యం ఎంచుకోబడింది? • డెమోక్రసీ • ఓటు హక్కు • ప్రజాస్వామ్యం ఎలా ఉపయోగపడుతుంది? • ప్రజాస్వామ్య పాలన ఎందుకు అన్నిటికంటే ముఖ్యమైనది? • గొప్ప నాయకులకుండే లక్షణాలు • నాయకులను ఎవరు నిర్ణయిస్తారు?


ఒక దేశంలోని ప్రజలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి సమర్ధవంతమైన నాయకులు అవసరం.

సమర్ధవంతమైన నాయకులు రావాలంటే దేశంలో డెమోక్రసీ లేదా ప్రజాస్వామ్యం అమలు చెయ్యాలి.

ఇంతకీ డెమోక్రసీ అంటే ఏంటి?, అది మనకు ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం..

ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో చూసినా ముఖ్యంగా రెండు రకాల పరిపాలన వ్యవస్థలు కనిపిస్తాయి.. ఒకటి AUTOCRACY , రెండు ARISTOCRACY.

AUTOCRACY లేదా నియంత పాలనలో దేశంలోని సర్వాధికారాలు కేవలం ఒక్కరికే ఉంటాయి.

దేశ భవిష్యత్తు కేవలం అక్కడున్న రాజు లేదా రాణి తీసుకున్న నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది.

ఉదాహరణకు, అశోక చక్రవర్తి, అక్బర్ ఇంకా తుగ్లక్ పాలనలు తీసుకోవచ్చు.

ARISTOCRACY లేదా దొరల పాలనలో దేశంలోని వివిధ భూభాగాలు సంపన్నుల చేత పాలింపబడతాయి.

ఉదాహరణకు, భారత దేశంలోని బ్రిటిష్ పాలనను తీసుకోవచ్చు.

నియంతలు, దొరల పాలనలో దేశాల ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులకు, శిక్షలకు గురయ్యేవారు.

AUTOCRACY ఇంకా ARISTOCRACY వల్ల వచ్చిన సమస్యల మూలాన ప్రపంచ దేశాల ప్రజలలో ఐక్యతాభావం పెరిగింది.

వందల సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించిన ప్రజలు చివరికి పాలకుల మీద తిరగబడటం మొదలుపెట్టారు.

నాయకులంటే న్యాయవ్యవస్థకు కట్టుబడి ఉండాలని పట్టుబట్టారు..

సేవాదృక్పధం ఉన్న వ్యక్తులకు మాత్రమే నాయకులయ్యే అర్హత ఉందని గ్రహించారు.

ఆలా తమకు నచ్చిన నాయకులని ఎన్నుకునే కొత్త విధానాన్ని మొదలుపెట్టారు.

ఈ వ్యవస్థనే, డెమోక్రసీ లేదా ప్రజాస్వామ్యం అని అంటారు.

ఇప్పుడున్న భారతదేశ ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వమే.

దేశంలో ఎన్నికలు నిర్వహించి, కాలానుసారం ప్రజలు వాళ్ళ నాయకులను ఎంచుకుంటున్నారు.

అధికశాతం ఓట్లు పొందిన అభ్యర్థులు మాత్రమే అధికారులగానూ నాయకులగానూ నియమితులవుతారు.

నాయకులంటే, దేశ ప్రజల కష్టాలను తమ కష్టాలుగా మార్చుకునేవాళ్ళు.

సమాజంలో జరిగే తప్పులను వేలెత్తి చూపించేవాళ్లు.

బానిసత్వాన్ని, పేదరికాన్ని నిర్మూలించేవాళ్ళు..

కుల, మత, జాతి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరినీ సమానంగా చూసేవాళ్ళు.

ప్రజల భావాలనూ ఆలోచనలనూ అడిగి తెలుసుకునేవాళ్ళు.

అందరికీ నచ్చే ఇలాంటి నాయకులు ప్రజాస్వామ్యంలో మాత్రమే ఉంటారు.

ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ఇలాంటి నాయకులు సమాజం పట్లా, దేశం పట్లా, బాధ్యతాభావంతో నడుచుకుంటారు.

స్వేచ్ఛ అనే పదానికి నిజమైన అర్ధం ప్రజాస్వామ్య దేశాలలోనే దొరుకుతుంది.


Popular posts from this blog

What are Hormones? (in Telugu) హార్మోన్స్ అంటే ఏమిటి?

What is Positive Thinking? (in Telugu) పాజిటివ్ థింకింగ్ అంటే ఏమిటి?

What is Habeas Corpus? (in Telugu) హెబియస్ కార్పస్ అంటే ఏమిటి?