What is Law of Karma? (in Telugu) కర్మ సిద్ధాంతం
ఏ మనిషైనా కోరుకునేది ఒక్కటే.. ఎలాంటి కష్టాలు, బాధలు లేని జీవితం.. అయితే, కోరుకున్న ఉద్యోగం వస్తేనో, కావలసినంత డబ్బు సంపాదిస్తేనో మన కష్టాలన్నీ తీరిపోతాయి అనుకోవడం పెద్ద పొరపాటు.. మన ఆలోచనా విధానం, చేసే పనులు.. ఈ రెండిటి ఆధారంగానే, మన జీవితం నిర్ణయించబడి ఉంటుంది.. ఈ నిజాన్ని అద్భుతంగా వివరించే ఒక ఆధ్యాత్మిక నమ్మకమే కర్మ సిద్ధాంతం. ఇంతకీ కర్మ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఒకరి కోరికలను బట్టే, వారి చేష్టలు ఉంటాయి.. చేష్టలను బట్టే అలవాట్లు ఉంటాయి.. అలవాట్లను బట్టే ప్రవర్తన ఉంటుంది.. ఆ ప్రవర్తనే అతని జీవితాన్ని మారుస్తుంది... కనుక ఒక వ్యక్తి ఎలంటివాడు, అతని జీవితం ఎలా ఉండబోతోంది అన్నది, అతని కోరికలను బట్టి చెప్పొచ్చు.. మన జీవితంలో ప్రస్తుతం జరిగే ప్రతిదానికీ కారణం, మనం గతంలో చేసిన ఆలోచనలు, ఎంపికలు, పనులు, ఇంకా చేష్టలు.. కర్మ అనే పదానికి అర్థం... పని, అలవాటు లేదా చేష్ట. ఇది దేవుడికి సంబంధించిన విషయం కాదు.. మానవ జీవితం, ఇంకా నైతిక విలువలకు సంబంధించింది.. అయితే, మనం చేసే అన్ని పనులూ కర్మలు కావు.. కేవలం ఉద్దేశపూర్వకంగా చేసిన పనులు మాత్రమే కర్మలవుతాయి. మన జీవితాలలో ఇదివ...