What is Internet and how it works? (in Telugu) ఇంటర్నెట్ అంటే ఏమిటి?

సరిగ్గా 20 ఏళ్ల ముందు వరకు, ముఖ్యమైన సమాచారాన్ని చేరవేయడానికి ఉత్తరాలు రాసేవారు.

కానీ ఇప్పుడు వాటికి బదులు, మనం E mail, Whatsapp, Messenger వంటి సదుపాయాలు వాడుతున్నాం.

మనకి ఇష్టమైన సినిమాలు, థియేటర్ కి వెళ్లి చూసే అవసరం లేకుండా, నేరుగా మన స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీదనే చూస్తున్నాం..

గంటలు, రోజుల తరబడి చేసే పనులను, నిమిషాల వ్యవధిలో చెయ్యగలుగుతున్నామ్.

వీటన్నిటికీ కారణం, INTERNET. ఇంతకీ ఇంటర్నెట్ ఆంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..



ఏ రకమైన సమాచారాన్నైనా డాక్యుమెంట్ల రూపంలోనో, ఫోటోలు, వీడియోలు, ఆడియోల రూపంలోనో ఒక కంప్యూటర్లో నిక్షిప్తం చెయ్యొచ్చు..

ఈ విధంగా మన చుట్టూ కొట్లకొద్ది కంప్యూటర్ల లోనూ, మొబైల్ ఫోన్లలోనూ నిరంతరం సమాచారం నిక్షిప్తం అవుతూ ఉంది..

ఈ సమాచారం మొత్తాన్ని బహిర్గతం చేసి, అందరూ ఉపయోగించుకొనేలా చేస్తే, అప్పుడు అది WORLD WIDE WEB లేదా www అనే సాంకేతిక వ్యవస్థలో చేరుతుంది..

ఈ WORLD WIDE WEB లో ఉన్న సమాచారాన్ని పొందడానికి మనకి ఉపయోగపడేదే INTERNET.

ప్రపంచ నలుమూలల నుండీ మనకి కావలసిన సమాచారాన్ని క్షణాల్లో పొందడానికి సహాయపడుతుంది.

వేర్వేరు వ్యక్తిగత, సామాజిక, వ్యాపార, ప్రభుత్వ రంగ సంస్థలు ఒకదానితో మరొకటి సులువుగా అనుసంధానం అయ్యేలా చేస్తుంది.

INTERNET కు ఆ పేరు, INTERNETWORKING అన్న పదం నుండీ పెట్టబడింది.

INTERNETWORKING అంటే, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వ్యవస్థలు లేదా సిస్టమ్ లు, అంతర్గతంగా అనుసంధానం అవ్వడం.

ఇది ప్రపంచం మొత్తాన్ని ఏకం చేసే ఒక అంతర్జాతీయ వ్యవస్థ.

అయితే ఇంటర్నెట్ ఎలా, ఎప్పుడు మొదలైంది?

1960 నుండి 1980 మధ్యకాలంలో యునైటెడ్ స్టేట్స్ సైన్యం రహస్యంగా సమాచారాన్ని చేరవేయడానికి ARPANET అనే వ్యవస్థను ఉపయోగించేది..

ఇది ఆప్టికల్ ఫైబర్, శాటిలైట్, ఇంకా వైర్లెస్ సాంకేతికతలతో పనిచేస్తుంది.

దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న రక్షణ విభాగాలు, ఒకటిగా కలిసి పనిచేయడానికి, సమాచారాన్ని పంచుకోడానికి, ఈ ARPANET ఉపయోగపడేది.

1980లలో ఈ ARPANET ను క్రమంగా అంతర్జాతీయ వ్యాపార సంస్థలు కూడా అంతర్గత సంభాషణల కోసం ఉపయోగించడం మొదలుపెట్టాయి..

1990 నాటికి, ARPANET వివిధ రంగాలకు విస్తరించి, INTERNET గా అవతరించింది.

E-Mail, ఇన్స్టంట్ మెసేజింగ్, వీడియో కాలింగ్, ఆన్లైన్ షాపింగ్ వంటివి ఇంటర్నెట్ ద్వారానే అభివృద్ధి చెందాయి..

మనం నిత్యం వాడుతున్న వివిధ రకాల యాప్లు, వెబ్సైట్లు, వినోద సాధనాలు, ఇంటర్నెట్ ఆధారంగా పనిచేస్తాయి..

పాటలు వినడానికి, వీడియోలు చూడడానికి, న్యూస్ చదవడానికి, ఇంటర్నెట్ మీదే ఆధారపడుతున్నాం.

మనకి ఎలాంటి సమాచారం కావాలన్నా, ఏ విధమైన సేవలు పొందాలన్నా, ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నాం..

Internet కారణంగా ప్రపంచం, సాంకేతికపరంగా ఎంతో వేగంగా అభివృద్ధి చెందింది.

Facebook, Twitter, Instagram, YouTube లాంటి సామాజిక వేదికలు ప్రపంచానికి పరిచయం అయ్యాయి.

ప్రభుత్వాల పనితీరు,సంక్షేమ కార్యక్రమాలు, రక్షణ వ్యవస్థలు, ఎంతగానో మెరుగుపడ్డాయి.

ఇంటర్నెట్ విద్యావ్యవస్థకు కూడా ఎంతగానో సహాయపడుతుంది..

విద్యార్థులు తమకు కావలసిన పాట్యభాగాలను WIKIPEDIA వంటి సైట్ల ద్వారా ఉచితంగా పొందుతున్నారు.

ఆన్లైన్ బ్యాంకింగ్, UPI వంటి సదుపాయాల ద్వారా బ్యాంకింగ్ సేవలు, నగదు లావాదేవీలు, ఎంతో సులువుగా, ఇంకా సురక్షితంగా మారాయి..


Popular posts from this blog

What are Hormones? (in Telugu) హార్మోన్స్ అంటే ఏమిటి?

What is Positive Thinking? (in Telugu) పాజిటివ్ థింకింగ్ అంటే ఏమిటి?

What is Habeas Corpus? (in Telugu) హెబియస్ కార్పస్ అంటే ఏమిటి?