What is Mutual Funds? (in Telugu) మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

మీరు ఒక ఇన్వెస్టర్ లా మారాలని అనుకుంటున్నారా?మీ డబ్బులను ఎలాంటి రిస్క్ లేకుండా, సురక్షితంగా INVEST చేసి, లేదా పెట్టుబడిగా పెట్టి లాభాలను పొందాలనుకుంటున్నారా?

అయితే, మ్యూచువల్ ఫండ్స్ మీకొక సులభమైన మార్గం..

ఇంతకీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? అదెలా పనిచేస్తుంది? పెట్టుబడులు పెట్టడానికి ఇదెందుకు సురక్షితమైన మార్గమో ఇప్పుడు తెలుసుకుందాం...



ఒకరు నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం, లేదా షేర్లను కొనడం వల్ల, రిస్క్ శాతం ఎక్కువగా ఉంటుంది..

షేర్లని ఏవిధంగా కొనాలి, ఏ విధంగా అమ్మాలో తెలియక గందరగోళానికి గురి అవుతారు..

మ్యూచువల్ ఫండ్స్ కూడా పెట్టుబడుల ఆధారంతో లాభాలు పొందడానికి సహాయపడే ఒక మార్గం..

అయితే, ఇందులో మనం పెట్టుబడులు పెట్టిన తర్వాత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. మన డబ్బులు సురక్షితంగా మధ్య వ్యక్తుల చేతుల్లో ఉంటాయి..

ఈ మధ్య వ్యక్తులే మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు..

ఉదాహరణకు, SBI MUTUAL FUND, ICICI PRUDENTIAL MUTUAL FUND, AXIS MUTUAL FUND మొదలైనవి..

మనం పడాల్సిన రిస్క్ అంతా వీళ్ళే పడి, స్టాక్ మార్కెట్లో లాభాల దిశగా పయనిస్తున్న షేర్లను కొని అమ్ముతూ ఉంటారు..

ఇన్వెస్టర్లు తమ వద్ద పెట్టుబడిగా పెట్టిన డబ్బులను, వివిధ కంపెనీల స్టాక్లలోనూ, ఆస్తులలోనూ తిరిగి పెట్టుబడులుగా పెట్టి మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు లాభాలు పొందుతాయి..

ఇన్వెస్టర్లకి ఆ లాభాలలోని వాటాలను వడ్డీల రూపంలో అందిస్తాయి...

మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలలో పెట్టుబడులు పెడితే, మనం పరోక్షంగా స్టాక్ మార్కెట్లో షేర్లను కొన్నట్లే...

ఉదాహరణకు, మీ దగ్గర ఒక 500 రూపాయలు ఉన్నాయని అనుకుందాం..

స్టాక్ మార్కెట్లో అయితే ఆ ఐదు వందల రూపాయలతో మీరు ఏదోఒక కంపెనీలో సుమారుగా ఒక్క షేర్ మాత్రమే కొనగలరు..

ఒకవేళ సదరు కంపెనీ నష్టపోతే, మీరూ నష్టపోయినట్లే..

అదే మీరు ఆ ఐదు వందల రూపాయలనీ ఒక మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలో పెట్టుబడిగా పెడితే, ఒక్కో రూపాయి చొప్పున ఐదు వందల కంపెనీల షేర్లని కొనినవారు అవుతారు..

దీన్నే DIVERSIFICATION, లేదా వైవిధ్యీకరణ అంటారు.. ఇది మ్యూచువల్ ఫండ్స్ కి ఉన్న ఒక ప్రత్యేకత..

దీనివల్ల మనం నష్టపోయే అవకాశాలు తక్కువ..

మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల భవిష్యత్తు, ప్పూర్తిగా అవి పెట్టుబడులు పెడుతున్న స్టాక్లమీదా, ఆస్తులమీదా ఆధార పడి ఉంటుంది..

ఈ కంపెనీలు పెట్టిన మొత్తం పెట్టుబడులను, వాటి ఇన్వెస్టర్ల సంఖ్యతో భాగించి, ఒక్కో భాగాన్ని NET ASSET VALUE లేదా NAV అని పిలుస్తారు..

ఒక మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలో ఎన్ని అసెట్లు కొంటే, అంత పెట్టుబడి పెట్టినట్లు..

స్టాక్ మార్కెట్లో వివిధ కంపెనీల షేర్ వాల్యూలతో పోలిస్తే, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల అసెట్ వాల్యూలు ఎంతో చౌకగా ఉంటాయి..

స్టాక్ మార్కెట్ లాభాల దిశగా వెళ్తున్నప్పుడు, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల అసెట్ వాల్యూలు కూడా క్రమంగా పెరుగుతాయి..

ఇందులో నష్టాలనేవి అంతగా ఉండవు..

ఇది కాక, పెట్టుబడి విధానాన్ని మన ఇష్టానికి అనుగుణంగా ఎంచుకునే అవకాశాలు మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు మనకి అందిస్తాయి..

వీటినే MUTUAL FUNDS SCHEMES అని అంటారు..

మనకు లభించే వడ్డీ రేటు, ఎంచుకున్న స్కీమ్ ఆధారంగా ఉంటుంది..

ఇప్పట్లో NETBANKING, ఇంకా PHONEPE లాంటి UPI సేవల ద్వారా కూడా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టే సౌకర్యం మనకు ఉంది..

ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఒక సులభమైన మార్గం...

Popular posts from this blog

What is Positive Thinking? (in Telugu) పాజిటివ్ థింకింగ్ అంటే ఏమిటి?

What is Habeas Corpus? (in Telugu) హెబియస్ కార్పస్ అంటే ఏమిటి?

What is an Operating System? (in Telugu) ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమిటి?