What is Positive Thinking? (in Telugu) పాజిటివ్ థింకింగ్ అంటే ఏమిటి?
ఇంటర్నెట్‌లో సాధారణంగా అడిగే ఒక ప్రశ్న, "పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి?" లేదా "పాజిటివ్‌గా ఎలా ఆలోచించాలి?".
మనం ఆలోచించే విధానమే మన జీవితంలో ప్రతిదాన్ని నిర్ణయిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఉదాహరణకు, తరచూ చిరాకు పడే ఒక వ్యక్తి, తాను నిరుత్సాహంగా ఉండడమే కాక, చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా నిరుత్సాహపరుస్తాడు.
అదే విధంగా, ఎప్పుడూ హుషారుగా పనిచేసే ఒక వ్యక్తి, తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ ఉత్సాహపరుస్తాడు.
ఒకరి ఆలోచనలు ఏ విధంగా ఉంటే, వారి ఆరోగ్యం కూడా అదే విధంగా ఉంటుంది.
భావోద్వేగాలను, ఒత్తిడిని అధిగమించి శాంతంగా జీవించడానికి సహాయపడే ఆలోచనా విధానాన్నే పాజిటివ్ థింకింగ్ అని అంటారు.
పాజిటివ్ థింకింగ్ మనల్ని మానసికంగా బలంగా చేస్తుంది. ఇబ్బందులను ఉత్సాహంతో ఎదుర్కోవడంలో మనకు సహాయపడుతుంది.
ఇంతకీ పాజిటివ్ గా ఆలోచించడం ఎలా? ....
ఒకవేళ మిమ్మల్ని ఎవరో ఒక వ్యక్తో, ఏదో ఒక విషయమో బాధపెడుతుంటే, దాని నుండీ మీ దృష్టి మరాల్చుకోవడానికి ప్రయత్నించండి..
బాధ పడటం వల్ల, మీరు మీ పని సక్రమంగా చేయలేరని గుర్తుపెట్టుకోండి..
అనవసరమైన ఆలోచనల వల్ల, మీ సంతోషానికి మీరు దూరమవుతారు..
కాస్త విశ్రాంతి తీసుకోండి. మీకు నిరంతరం సంతోషాన్ని కలిగించే విషయాలను గుర్తుకుతెచ్చుకోండి. మీకు ఎక్కువగా నచ్చే విషయాలు లేదా వ్యక్తులతో గడపండి.
మనల్ని మనం సంతోషంగా చూసుకోవడం కంటే మంచి విషయం ఇంకేమి లేదు..
మనలోని కృతజ్ఞతా భావన ఒత్తిడిని తగ్గిస్తుంది. అది మన వ్యక్తిత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
కాబట్టి, మీకు సహాయపడుతున్న ప్రతి విషయానికి, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకోండి.
మీకు ఇష్టమైన సంగీతాన్ని ఆలకించండి. ఏ పని చేస్తున్నా హుషారుగా చెయ్యండి..
కష్టాలు, అడ్డంకులు జీవితంలో ఒక భాగం. మీకున్న సమస్యలపై దృష్టి పెట్టకండి. సరైన ఆలోచనా పద్ధతితో వాటిని ఎలా పరిష్కరించగలరు అన్నదానిపై దానిపై దృష్టి పెట్టండి.
చరిత్రలో ఖ్యాతిని గడించిన వ్యక్తుల జీవిత చరిత్రలను చదవండి. వారు వారి జీవితాలలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో తెలుసుకోండి.
మీలో ఉత్సాహాన్ని నింపే పాటలు వింటూ మీ రోజును ప్రారంభించండి.
ప్రతి రోజును గొప్పగా గడపాలని నిర్ణయించుకోండి. ఎలాంటి పరిస్థితులనైనా చిరునవ్వుతో ఎదుర్కోడానికి ప్రయత్నించండి.
ఇతరులు చేసే చాష్టలని పట్టించుకోవడం మానేసి, మీ మనసుని ఆనందంతో నింపుకోండి..