Why Lightning occurs? (in Telugu) పిడుగులు ఎందుకు పడతాయి?

పిడుగులు... ఇవి ఆకాశంలో మెరిసేటప్పుడు ఎంత అద్భుతంగా కనిపిస్తాయో, పడేటప్పుడు అంత భయంకరంగా ఉంటాయి.

ఒక్క భారతదేశంలోనే ఏటా సుమారు వేయి మందికి పైగా పిడుగుల బారినపడి మరణిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకూ, కనీసం వంద పిడుగులు నేలపై పడుతూ ఉంటాయి.

ఐతే, పిడుగులు ఎందుకు పడతాయి, ఎలాంటి ప్రదేశాల్లో పడతాయి, వీటి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పిడుగు, లేదా LIGHTNING అనేది మేఘాల నుండీ భూ ఉపరితలాన్ని తాకే అతి శక్తివంతమైన విద్యుత్ ప్రవాహం.

మేఘాల నుండీ విద్యుత్ ఎలా పుడుతుందని మీరు సందేహపడొచ్చు.

సాధారణంగా వాతావరణం చల్లబడినప్పుడు, మేఘాలలో ఉన్న నీరు ద్రవ ఇంకా ఘన పదార్థాలగా మారుతుంది.

వీటికి బలమైన గాలులు తోడైనప్పుడు, నీరు ఇంకా మంచు బిందువులు మధ్య రాపిడి ఏర్పడుతుంది.

ఇలా ఏర్పడిన రాపిడి వల్ల, మేఘాలలో కొన్ని వేల కోట్ల పాజిటివ్ ఇంకా నెగటివ్ ఛార్జ్ లు స్తృష్టించబడతాయి.

ఈ పాజిటివ్ ఇంకా నెగటివ్ ఛార్జ్ లు ఒకదానిని మరొకటి ఆకర్షించుకున్నప్పుడు అమితమైన విద్యుత్ శక్తి ఇంకా వేడి పుడుతుంది.

దీన్నే పిడుగు, లేదా LIGHTNING అని పిలుస్తారు.

ఒక్కో పిడుగు సమారు 30 కోట్ల వోల్ట్ ల వరకూ విద్యుత్ శక్తిని కలిగి ఉంటుంది.

ఇవి చుట్టూ ఉన్న గాలిని రెప్పపాటులో వేడెక్కించి, భయంకరమైన శబ్దాన్ని సృష్టిస్తాయి..

ఈ మొత్తం ప్రక్రియే మనకు వర్షం పడేటప్పుడు ఉరుములూ ఇంకా మెరుపులలా కనిపిస్తూ ఉంటుంది.

ఐతే, పిడుగులనేవి నేలను ఎప్పుడు తాకుతాయి? ఇవి ఎలాంటి ప్రదేశాల్లో పడతాయి అన్నవి ఇప్పుడు చూద్దాం.

పిడుగులకి కారణంగా చెప్పుకుంటున్న పాజిటివ్ ఇంకా నెగటివ్ ఛార్జ్ లు వర్షం కురిసే సమయంలో కేవలం మేఘాలలోనే కాదు, నేలపై ఉండే ఎత్తైన ప్రదేశాలు, చెట్లు, లోహాల వంటి వాటిపై కూడా సృష్టించబడతాయి.

ఛార్జ్ లను కలిగిఉన్న ఇలాంటి ప్రదేశాలు, వస్తువులు మేఘాలలో ఉండే వ్యతిరేక ఛార్జ్ లని ఆకర్షించి పిడుగులు పడటానికి అనువైన చొట్లగా మారతాయి.

ఉదాహరణకు ఎత్తైన చెట్లు, అపార్టుమెంట్లు, విశాలంగా ఉండే మైదానాలు, భవనాల డాబాలు, కరంటు స్తంభాల వంటి లోహపు వస్తువులు మొదలైనవి పిడుగులను ఆకర్షిస్తూ ఉంటాయి.

కొన్ని సార్లు గాలిలో ఎగురుతున్న విమానాలు సైతం పిడుగుపాట్లకు గురవుతాయి.

గత శతాబ్దంతో పోలిస్తే, ప్రస్తుత కాలంలో పిడుగుపాట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.

అడవి ప్రాంతాలు తగ్గిపోవడం, కార్చిచ్చులు, వాతావరణ కాలుష్యం ఇంకా గ్లోబల్ వార్మింగ్ మూలానే పిడుగులు పడటం ఎక్కువైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా సుమారు రెండు వేల మంది పిడుగుపాట్ల వల్ల మరణిస్తున్నారు.

కొన్ని వందలమందికి, పిడుగుపాటుకి గురైన తర్వాత జ్ఞాపక శక్తిని కోల్పోడం, పెరాలసిస్ వంటి శారీరక సమస్యలు రావడం వంటివి జరుగుతున్నాయి..

సాధ్యమైనంతవరకూ, బలమైన గాలులతో వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్ళకుండా ఉండటం ఎంతో మేలైన పని.

ఒకవేళ బయట ఉన్నట్లయితే.. కార్, వ్యాన్, బస్ లాంటి పెద్ద వాహనాలలో తల దాచుకోవాలి.

చెట్ల కింద, కరెంటు స్తంభాల దగ్గర, విశాలంగా ఉండే మైదానాల్లోనీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు.

పిడుగుపాట్లకు ఇంట్లో ఉండే టీవీ, ఫ్రిజ్, కంప్యూటర్ వంటి విద్యుత్ పరికరాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షం కురిసే సమయంలో వీటిని ఆపి ఉంచడమనేది ఉత్తమమైన పని.

Popular posts from this blog

What are Hormones? (in Telugu) హార్మోన్స్ అంటే ఏమిటి?

What is Positive Thinking? (in Telugu) పాజిటివ్ థింకింగ్ అంటే ఏమిటి?

What is Habeas Corpus? (in Telugu) హెబియస్ కార్పస్ అంటే ఏమిటి?