చాలా మందికి తరచుగా వచ్చే సందేహం... మన కలల్లో కనిపించేవన్నీ నిజంగా జరుగుతాయా, లేక కలలనేవి కేవలం మన ఊహలు మాత్రమేనా? కలలు మనకు తెలియని వేరొక అద్భుతమైన ప్రపంచానికి ద్వారాలా? కొన్ని సార్లు కలలు ఎంత మధురంగా ఉంటాయో, మరికొన్ని సార్లు అంతే భయంకరంగా ఉంటాయి. ఇంతకీ, మనకు నిద్రలో కలలు ఎందుకు వస్తాయి? కలల గురించి ఉన్న కొన్ని వాస్తవాలని ఇప్పుడు తెలుసుకుందాం.. నిద్రలో కలలు ఎందుకు వస్తాయన్నదానిపై పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కలలనేవీ కేవలం మెదడుకి సంబంధించినవని కొంతమంది చెబితే, ఆత్మకు సంబంధించినవని మరికొందరు చెబుతారు. ముందుగా, సైన్స్ కలల గురించి ఏ విధంగా చెప్తుందో చూద్దాం.. సాధారణంగా మనం పడుకున్నప్పుడు, శరీరం రెండు దశల్లో నిద్రలోకి వెళ్తుంది. మొదటిది, RAPID EYE MOVEMENT లేదా REM అనే దశ. ఈ దశలో శరీరంలోని అవయవాలు విశ్రాంతి తీసుకుంటున్నా, మెదడులోని ఆలోచనలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. రెండోది, NON RAPID EYE MOVEMENT లేదా N-REM అనే దశ. ఈ దశలో మెదడులోని ఆలోచనలు కూడా పూర్తిగా స్తంభిస్తాయి. దీన్నే గాఢ నిద్ర అని కూడా పిలుస్తారు. కలలనేవి మొదటిదైన RAPID EYE MOVEMENT దశలో మాత్రమే వస్తాయి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు క...