ఇంటర్నెట్లో సాధారణంగా అడిగే ఒక ప్రశ్న, "పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి?" లేదా "పాజిటివ్‌గా ఎలా ఆలోచించాలి?". మనం ఆలోచించే విధానమే మన జీవితంలో ప్రతిదాన్ని నిర్ణయిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదాహరణకు, తరచూ చిరాకు పడే ఒక వ్యక్తి, తాను నిరుత్సాహంగా ఉండడమే కాక, చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా నిరుత్సాహపరుస్తాడు. అదే విధంగా, ఎప్పుడూ హుషారుగా పనిచేసే ఒక వ్యక్తి, తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ ఉత్సాహపరుస్తాడు. ఒకరి ఆలోచనలు ఏ విధంగా ఉంటే, వారి ఆరోగ్యం కూడా అదే విధంగా ఉంటుంది. భావోద్వేగాలను, ఒత్తిడిని అధిగమించి శాంతంగా జీవించడానికి సహాయపడే ఆలోచనా విధానాన్నే పాజిటివ్ థింకింగ్ అని అంటారు. పాజిటివ్ థింకింగ్ మనల్ని మానసికంగా బలంగా చేస్తుంది. ఇబ్బందులను ఉత్సాహంతో ఎదుర్కోవడంలో మనకు సహాయపడుతుంది. ఇంతకీ పాజిటివ్ గా ఆలోచించడం ఎలా? .... ఒకవేళ మిమ్మల్ని ఎవరో ఒక వ్యక్తో, ఏదో ఒక విషయమో బాధపెడుతుంటే, దాని నుండీ మీ దృష్టి మరాల్చుకోవడానికి ప్రయత్నించండి.. బాధ పడటం వల్ల, మీరు మీ పని సక్రమంగా చేయలేరని గుర్తుపెట్టుకోండి.. అనవసరమైన ఆలోచనల వల్ల, మీ సంతోషానికి మీరు దూరమవుతారు.. కాస్త విశ్రాంతి తీసుక...