Why Dreams occur in sleep? (in Telugu) నిద్రలో కలలు ఎందుకు వస్తాయి?

చాలా మందికి తరచుగా వచ్చే సందేహం... మన కలల్లో కనిపించేవన్నీ నిజంగా జరుగుతాయా, లేక కలలనేవి కేవలం మన ఊహలు మాత్రమేనా?
కలలు మనకు తెలియని వేరొక అద్భుతమైన ప్రపంచానికి ద్వారాలా?

కొన్ని సార్లు కలలు ఎంత మధురంగా ఉంటాయో, మరికొన్ని సార్లు అంతే భయంకరంగా ఉంటాయి.

ఇంతకీ, మనకు నిద్రలో కలలు ఎందుకు వస్తాయి? కలల గురించి ఉన్న కొన్ని వాస్తవాలని ఇప్పుడు తెలుసుకుందాం..



నిద్రలో కలలు ఎందుకు వస్తాయన్నదానిపై పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

కలలనేవీ కేవలం మెదడుకి సంబంధించినవని కొంతమంది చెబితే, ఆత్మకు సంబంధించినవని మరికొందరు చెబుతారు.

ముందుగా, సైన్స్ కలల గురించి ఏ విధంగా చెప్తుందో చూద్దాం..

సాధారణంగా మనం పడుకున్నప్పుడు, శరీరం రెండు దశల్లో నిద్రలోకి వెళ్తుంది.

మొదటిది, RAPID EYE MOVEMENT లేదా REM అనే దశ. ఈ దశలో శరీరంలోని అవయవాలు విశ్రాంతి తీసుకుంటున్నా, మెదడులోని ఆలోచనలు మాత్రం జరుగుతూనే ఉంటాయి.

రెండోది, NON RAPID EYE MOVEMENT లేదా N-REM అనే దశ. ఈ దశలో మెదడులోని ఆలోచనలు కూడా పూర్తిగా స్తంభిస్తాయి. దీన్నే గాఢ నిద్ర అని కూడా పిలుస్తారు.

కలలనేవి మొదటిదైన RAPID EYE MOVEMENT దశలో మాత్రమే వస్తాయి.

గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా కొన్ని సార్లు కలలు వస్తాయి, కానీ అవి మేల్కొనే సమయానికి గుర్తుండవు.

ఒక సగటు మనిషికి, నిద్రలో సుమారు ఆరు కలల వరకూ వస్తాయి.

ఒక్కో కల కొన్ని క్షణాల నిడివి నుంచీ 30 నిమిషాల వ్యవధి వరకూ ఉంటుంది.

ఒక వ్యక్తి భావోద్వేగాలకు అనుకూలంగానే, వారికి కలలు రావడం జరుగుతుందని పరిశోధకులు చెబుతారు.

అంటే, మన జీవితంలో ఏవైతే జరగాలి లేదా జరగకూడదని బలంగా కోరుకుంటామో, అవే కలల ద్వారా అనుభూతి చెందుతాం.

పుట్టుకతోనే అంధులైన వారికి కూడా కలలు వస్తాయి. ఐతే, మనలాగా వారికి కలల్లో ఏమీ కనిపించవు. ఇతర స్పర్శల ద్వారా వాళ్ళు కలలను అనుభూతి చెందుతారు.

ఒక వ్యక్తి యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు కూడా, వారి కలలపై ప్రభావం చూపుతాయి.

ఒకర్ని ఎక్కువగా భయపెట్టే విషయాలు నిరంతరం మెదడుని ఒత్తిడికి గురి చేసి, నిద్రలో పీడకలలని సృష్టించేలా చేస్తాయి..

కలల ద్వారా మన మెదడు, శరీరంలో జరిగే మార్పులను, సమస్యలనూ అర్థం చేసుకొని ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతారు.

కలల గురించి చరిత్రలో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.

సుమారు 5 వేల సంవత్సరాలకు పూర్వం, ప్రాచీన మెశపటోనియన్ రాజులు కలలను దేవతలు పంపిన సందేశాలుగా భావించేవారు.

మన భారతదేశ పురాణాల్లో కూడా, పలుచోట్ల కలల గురించిన ప్రస్థావన జరిగింది.

ముఖ్యమైన దేవాలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల చరిత్రలో కూడా, కలల యొక్క ప్రాముఖ్యత కనిపిస్తుంది.

ప్రాచీన బాబిలోనియన్లు, వాళ్ళకొచ్చే మంచి కలలన్నీ దేవతలు పంపినవనీ, పీడకలలన్నీ రాక్షసులు పంపినవనీ భావించేవారు.

కొంత మంది, మనం నిద్రపోతున్నప్పుడు శరీరంనుంచి ఆత్మ బయటకు వస్తుందని, అది మనకు తెలియని ప్రదేశాలనూ, లోకాలనూ చుట్టి వస్తుందని ఇప్పటికీ నమ్ముతున్నారు.

కలలు మన భవిషత్తులో రాబోయే ఆపదలను ముందుగానే మనకి చూపిస్తాయని, అవి చూపించినట్లే మన జీవితం కూడా ఉంటుందన్నది ప్రపంచంలో ఎంతో మంది నమ్మకం.

ఇలా కలల గురించి మనం చెప్పుకోడానికి చాలా విషయాలు ఉన్నాయి.. ఐతే, మనం ఏది బలంగా నమ్ముతున్నామనేదే నిజమైన వాస్తవం.

Popular posts from this blog

What are Hormones? (in Telugu) హార్మోన్స్ అంటే ఏమిటి?

What is Positive Thinking? (in Telugu) పాజిటివ్ థింకింగ్ అంటే ఏమిటి?

What is Habeas Corpus? (in Telugu) హెబియస్ కార్పస్ అంటే ఏమిటి?