Posts

Showing posts from September, 2021

What is Habeas Corpus? (in Telugu) హెబియస్ కార్పస్ అంటే ఏమిటి?

Image
ఒక వ్యక్తి చట్టపరమైన నేరం చేస్తే అరెస్టు కాబడడం సహజం... అయితే, ఒకవేళ ఎలాంటి నేరం చేయకపోయినా అరెస్ట్ అయితే ఏం జరుగుతుంది? పోలీసులకు తలచుకుంటే ఎవరినైనా అరెస్టు చేయగలిగే అధికారం ఉంటుందా? ఒకవేళ మనం కూడా ఎప్పుడైనా అన్యాయంగా అరెస్ట్ అయితే ఏవిధంగా న్యాయం పొందాలి? మన భారత రాజ్యాంగంలో పొందుపరచిన 22వ ఆర్టికల్ ఏం చెబుతుంది, ఇంకా 'హెబియస్ కార్పస్' (HABEAS CORPUS) అనే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మన భారతదేశ రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ అనుసారం, ప్రతి వ్యక్తికీ సమాజంలో స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. ఇష్టానుసారంగా ప్రజల స్వేచ్చను హరించగలిగే అధికారం లేదా నిర్బంధించే హక్కు ఏ సంస్థలకూ, అధికారులకూ లేదు. 21వ ఆర్టికల్ కు బలం చేకూరే విధంగా 22వ ఆర్టికల్ ఇంకా 'హెబియస్ కార్పస్' అనే విధానాన్ని రాజ్యాంగంలోని 226వ ఆర్టికల్ లో చేర్చారు.. పోలీసులు గానీ వేరే ఇతర అధికారులు గానీ, ఒకరిని ఏ కారణం వల్లైనా అరెస్ట్ చేయాల్సి వస్తే, అలా చేసిన వెంటనే లేదా 24 గంటలలోపు సదరు వ్యక్తిని న్యాయస్థానం ఎదుట నిలబెట్టవలసి ఉంటుంది. దీనివల్ల ఒక వ్యక్తి చట్టపరంగానే అరెస్టు కాబడ్డాడా, లేక అన్యాయంగా అతన్ని అరెస్టు చేశార...

What is Psychology? & uses of Psychology (in Telugu) సైకాలజీ అంటే ఏమిటి?

Image
ఈ ప్రపంచంలో ఎంత గొప్పవారినైనా అన్నిటికంటే కష్టమైన పని ఏంటని అడిగితే... ఎదుటివారి మనసుని, ఆలోచనలని అర్థం చేసుకోవడం అని అంటారు. సాధారణంగా తల్లిదండ్రులకి పిల్లలనూ, టీచర్లకి విద్యార్థులనూ, వ్యాపారస్తులకి కస్టమర్లనూ అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే.. సైన్స్ లో మనసు, ఆలోచనలు ఇంకా భావోద్వేగాలు ఎలా పనిచేస్తాయో చెప్పే ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ ఉంది. అదే సైకాలజీ (PSYCHOLOGY). సైకాలజీ సబ్జెక్ట్ గురించిన విషయాలను, దీని ఉపయోగాలను ఇప్పుడు తెలుసుకుందాం.. సైకాలజీ పూర్తిగా మానవ మెదడు, ఇంకా దాని పనితీరుకు సంబంధించినది. వ్యక్తుల యొక్క ఆలోచనా విధానం, ఇంకా వారి ప్రవర్తన గురించి అధ్యయనం చేస్తే, దాన్నే సైకాలజీ (PSYCHOLOGY) అని అంటారు. అంటే, ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఏవిధంగా ప్రవర్తిస్తాడు, మనుషుల మధ్య ఉన్నప్పుడు ఏవిధంగా ప్రవర్తిస్తాడు అనే విషయాలను సైకాలజీలో ప్రధానంగా చర్చిస్తారు. దీనితోపాటు ఒక వ్యక్తి యొక్క భావోద్వేగాలను, వాటికి గల కారణాలను, మానసిక పరిస్థితిని, వ్యక్తిత్వాన్ని కూడా సైకాలజీలో అధ్యయనం చేస్తారు. ఒకరి శారీరక ఆరోగ్యం వారి యొక్క మానసిక పరిస్థితులపై ఏవిధంగా ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని సై...