What is Psychology? & uses of Psychology (in Telugu) సైకాలజీ అంటే ఏమిటి?
ఈ ప్రపంచంలో ఎంత గొప్పవారినైనా అన్నిటికంటే కష్టమైన పని ఏంటని అడిగితే... ఎదుటివారి మనసుని, ఆలోచనలని అర్థం చేసుకోవడం అని అంటారు.
సాధారణంగా తల్లిదండ్రులకి పిల్లలనూ, టీచర్లకి విద్యార్థులనూ, వ్యాపారస్తులకి కస్టమర్లనూ అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది.
అయితే.. సైన్స్ లో మనసు, ఆలోచనలు ఇంకా భావోద్వేగాలు ఎలా పనిచేస్తాయో చెప్పే ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ ఉంది. అదే సైకాలజీ (PSYCHOLOGY).
సైకాలజీ సబ్జెక్ట్ గురించిన విషయాలను, దీని ఉపయోగాలను ఇప్పుడు తెలుసుకుందాం..
సైకాలజీ పూర్తిగా మానవ మెదడు, ఇంకా దాని పనితీరుకు సంబంధించినది.
వ్యక్తుల యొక్క ఆలోచనా విధానం, ఇంకా వారి ప్రవర్తన గురించి అధ్యయనం చేస్తే, దాన్నే సైకాలజీ (PSYCHOLOGY) అని అంటారు.
అంటే, ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఏవిధంగా ప్రవర్తిస్తాడు, మనుషుల మధ్య ఉన్నప్పుడు ఏవిధంగా ప్రవర్తిస్తాడు అనే విషయాలను సైకాలజీలో ప్రధానంగా చర్చిస్తారు.
దీనితోపాటు ఒక వ్యక్తి యొక్క భావోద్వేగాలను, వాటికి గల కారణాలను, మానసిక పరిస్థితిని, వ్యక్తిత్వాన్ని కూడా సైకాలజీలో అధ్యయనం చేస్తారు.
ఒకరి శారీరక ఆరోగ్యం వారి యొక్క మానసిక పరిస్థితులపై ఏవిధంగా ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని సైకాలజీ ద్వారా మనం తెలుసుకోవచ్చు.
మనుషులు బాధల నుండీ కోలుకొని, మానసిక ప్రశాంతతను ఎలా పొందాలి అనే ప్రశ్నకు సమాధానాలను సైకాలజీ ద్వారా అన్వేషించవచ్చు.
డిప్రెషన్ ఇంకా మానసిక సమస్యలను పరిష్కరించడంలో వైద్యులకు సైకాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది.
సైకాలజీ (PSYCHOLOGY) అన్న పదం గ్రీక్ భాష నుండీ తీసుకోబడింది. సైకే (PSYCHE) అంటే 'అంతరాత్మ' అని అర్థం. లాజియా (LOGIA) అంటే 'శాస్త్రం' అని అర్థం.
సైకాలజీపై పట్టు సాధించినవారిని సైకాలజిస్ట్ అని అంటారు.
సైకియాట్రీ (PSYCHIATRY), హిప్నాటిజం (HYPNOTISM), మైండ్ రీడింగ్ (MIND-READING) వంటి ఆసక్తికర విషయాలు కూడా సైకాలజీలోని భాగాలే..
ఇది ముఖ్యంగా పిల్లల ప్రవర్తనను అర్థం చేసుకోవడంలోనూ, స్కూళ్ళలో సరైన బోధనా పద్ధతులను అనుసరించడంలోనూ, వైద్య రంగంలో కూడా ఉపయోగపడుతుంది.
వ్యాపారరంగంలో వినియోగదారుల అభిప్రాయాలను సేకరించడంలో కూడా, సైకాలజీ కీలక పాత్ర పోషిస్తుంది.
కస్టమర్లకు నచ్చే వస్తువులు ఇంకా సేవలను అందించడంలో వ్యాపారసంస్థలకు సైకాలజీ ఉపయోగపడుతుంది.
హార్రర్, థ్రిల్లర్ వంటి జానర్లలో వచ్చే సినిమాలను కూడా, భావోద్వేగాలను రాబట్టే విధంగా వీక్షకుల సైకాలజీ ఆధారంగా రూపొందిస్తారు.
సైకాలజీలో CHILD DEVELOPMENT, COGNITIVE PSYCHOLOGY, SOCIAL PSYCHOLOGY, CLINICAL PSYCHOLOGY... ఇలా ఎన్నో విభాగాలు ఉన్నాయి.
సైకాలజీ చదవడం ద్వారా ఇతరుల గురించి తెలుసుకోవడమే కాదు, మన సొంత వ్యక్తిత్వాన్ని కూడా మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది.
ఆసక్తి ఉంటే సైకాలజీ ఎవరైనా, ఏ వయసువరైనా చదువుకోవచ్చు.. దీనికి సంబంధించిన ఎన్నో ప్రఖ్యాతి గడించిన పుస్తకాలు మనకి అందుబాటులో ఉన్నాయి.
THINKING FAST AND SLOW, THE POWER OF HABIT, HOW TO WIN FRIENDS AND INFLUENCE PEOPLE మొదలైనవాటితో మీరూ సైకాలజీ చదవడం మొదలుపెట్టొచ్చు.