Posts

Showing posts from December, 2021

What is Depression? Causes of Depression (in Telugu) డిప్రెషన్ అంటే ఏమిటి?

Image
ఒకరు ఎంత చిన్నవారైనా, ఎంత పెద్దవారైనా... తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు వారి భావోద్వేగాలను నియంత్రించడం ఎవరివల్లా కాని పని. అలా ఒకరి భావోద్వేగాలు పూర్తిగా నియంత్రణ తప్పినప్పుడు, అదొక తీవ్రమైన మానసిక సమస్యగా మారుతుంది..  ఈ పరిస్థితినే వైద్యపరంగా డిప్రెషన్ (DEPRESSION) అని పిలుస్తారు. డిప్రెషన్ వల్ల ఒకరి ప్రవర్తన ప్రమాదకరంగా మారుతుంది. ఆత్మహత్య వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకొనేలా చేస్తుంది. అయితే, ఒకరు మానసికంగా అనుభవించే బాధ డిప్రెషన్ గా ఎలా మారుతుంది? డిప్రెషన్ కు గురవడానికి గల కారణాలను, అలాగే దీనివల్ల వచ్చే సమస్యలను ఇప్పుడు తెలుసుకుందాం.. బాధ అనేది మనిషిని ఎదురించేలా చేస్తుంది. ఇది వారిలో ప్రతీకార స్వభావాన్ని పెంచుతుంది.. లేదంటే ఆ బాధే వారి మరణానికి కారణం అవుతుంది. ఒక వ్యక్తి జీవితంలో విషాదకరమైన సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు, వాటికి ప్రతిచర్యగా వారి మెదడు డిప్రెషన్ అనే స్థితిలోకి వెళ్తుంది. ఈ దశలో బాధితుల మనసంతా ప్రతికూలమైన ఆలోచనలతో నిండి ఉంటుంది.  ఆకలి వేయకపోవడం, నిద్ర పట్టకపోవడం డిప్రెషన్ యొక్క ప్రధాన లక్షణాలు. ఇది జీవితంపై పూర్తిగా నిరాశను కలుగజేస్తుంది. ఒక వ్యక్తి డిప్రెషన్ బారిన...