What is Asthma? • Causes of Asthma (in Telugu) • ఆస్థమా అంటే ఏమిటి?
ఆస్థమా లేదా బ్రాంఖయల్ ఆస్థమా.. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి సుమారు 25 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఊపిరితిత్తులకు చేరే వాయు మార్గాలన్ని చీముడుతో నిండిపోడం, లేదా అవి ఉబ్బడాన్ని ఆస్తమా అని అంటారు. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే, ప్రాణానికే ప్రమాదం తెప్పించగలదని చెప్పొచ్చు.. అయితే, ఆస్తమా ఎందుకు వస్తుంది? ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి? ఆస్తమా వ్యాధిగ్రస్తులు యెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవాటిగురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనం ఊపిరి తీసుకునేటప్పుడు, శ్వాసనాళాలు లేదా bronchus రిలాక్స్ అవుతాయి. దీనివల్ల గాలి సులభంగా ఊపిరితిత్తులకు చేరడం, తిరిగి రావడం జరుగుతుంది.. కానీ, ఆస్థమా సోకినప్పుడు ఈవిధంగా జరగదు. హఠాత్తుగా శ్వాసనాళాల యొక్క కండరాలు ఉబ్బటం చేత ఊపిరితిత్తులు తగినంత గాలిని పీల్చుకోలేవు. అంతే కాకుండా ఆస్తమా అట్టాక్ వచ్చినప్పుడు శ్వాసకోశాలు చీమిడితో పూర్తిగా నిండిపోతాయి. ఆస్తమా పలువిధాలుగా బాధిస్తుంది. ఈ వ్యాధి సోకిన అందరిలో ఒకే రకమైన లక్షణాలు కనిపించవు. కొందరి...