What is Quantum Theory? (in Telugu) క్వాంటమ్ థియరీ అంటే ఏమిటి?
మనకి అణువులు లేదా atoms అన్నవి ఈ విశ్వంలో అతిచిన్న వస్తువులు అని తెలుసు.. కానీ గత శతాబ్దంలో జరిగిన పరిశోధనల ప్రకారం, అణువుల కంటే చిన్నవి కూడా మన విశ్వంలో ఉన్నాయని తెలిసింది. దీనితో పాటూ, మనం చిన్నప్పటి నుండీ చదువుకున్న సైన్స్ అంతా కూడా ఈ అతిచిన్న పరిమాణంలో ఉన్న విషయాలపై ఏమాత్రం పనిచేయదు అన్న విషయం కూడా బయటపడింది.. ఈ రెండు విషయాలు ఐన్స్టైన్, మ్యాక్స్ ప్లాంక్, హైసెంబర్గ్ లాంటి మేధావులను సైతం నిద్రపోనివ్వకుండా చేశాయి.. మనకు తెలియని విశ్వం ఇంకేదో ఉందన్న నమ్మకాన్ని కలిగేలా చేశాయి. మన కంటికి కనిపించనంత చిన్న స్థాయిలో ఈ విశ్వం మరోలా పనిచేస్తుందని మేధావులు అందరూ కూడా భావించారు.. అలా వారి ఆలోచనల ద్వారా పుట్టిందే క్వాంటమ్ థియరీ (QUANTUM THEORY).. క్వాంటమ్ థియరీ గురించిన కొన్ని ప్రాథమిక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. క్వాంటమ్ థియరీ లేదా క్వాంటమ్ మెకానిక్స్, మనం చిన్నప్పటి నుండీ నేర్చుకున్న సైన్స్ కంటే పూర్తిగా భిన్నమైనది. ఇంగ్లీష్ లో మెకానిక్స్ (MECHANICS) అంటే 'కదలిక' లేదా 'పనితీరు' అని అర్థం.. క్వాంటమ్ (QUANTUM) అంటే 'అతి చిన్న' అని అర్థం.. ఈ విశ్వంలో అణువుల కంటే చిన్న...