What are Dimensions in Physics? (in Telugu) • భౌతికశాస్త్రం లోని 1D, 2D, 3D & 4D డైమెన్షన్స్
మీరు ఇదివరకూ 2D, 3D అనే విషయాలను సినిమాల్లో చూసి ఉంటారు.. ఇక్కడ D అంటే Dimension అని అర్థం.. Physics ఇంకా mathematics లో కనిపించే ఈ Dimension అన్న విషయాన్ని నిజానికి అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇది సాధారణంగా ఒక వస్తువు ఏవిధంగా కనిపిస్తుంది, లేదా ప్రయాణిస్తుంది అన్న విషయాలని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకూ జరిగిన అధ్యయనాల ప్రకారం, ఒక వస్తువు సుమారు 11 రకాల డైమెన్షన్స్ లో ప్రయానించగలదు. అయితే, మీరు డైమెన్షన్స్ ని సులువుగా అర్థం చేసుకోవడానికి ఈ వీడియోలో మనకు బాగా తెలిసిన ఉదాహరణలతో విషయాలను పోల్చడం జరిగింది. అసలు Dimension అంటే ఏంటి, 1D, 2D, 3D ఇంకా 4D రకాల డైమెన్షన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏదైనా ఒక వస్తువు ప్రయాణించాలి అంటే ముందుగా అది ఏదో ఒక చోటు నుండి తన ప్రయాణాన్ని మొదలు పెట్టాలి.. ఉదాహరణకు, ఒక లిఫ్ట్ కింద ఫ్లోర్ నుండీ స్టార్ట్ అయితేనే పై ఫ్లోర్స్ కి వెళ్తుంది.. ఒక విమానం రన్ వే పై మొదలైతే నే గాల్లోకి ఎగురుతుంది.. ఈ విధంగా ఒక వస్తువు స్టార్ట్ అయ్యే చోటుని దాని యొక్క Origin అని పిలుస్తారు.. అయితే Origin కి, Dimension కి సంబంధం ఏమిటి అని మీరు అనుకుంటూ ఉం...