What are Dimensions in Physics? (in Telugu) • భౌతికశాస్త్రం లోని 1D, 2D, 3D & 4D డైమెన్షన్స్

మీరు ఇదివరకూ 2D, 3D అనే విషయాలను సినిమాల్లో చూసి ఉంటారు..

ఇక్కడ D అంటే Dimension అని అర్థం..

Physics ఇంకా mathematics లో కనిపించే ఈ Dimension అన్న విషయాన్ని నిజానికి అర్థం చేసుకోవడం చాలా కష్టం.

ఇది సాధారణంగా ఒక వస్తువు ఏవిధంగా కనిపిస్తుంది, లేదా ప్రయాణిస్తుంది అన్న విషయాలని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఇప్పటి వరకూ జరిగిన అధ్యయనాల ప్రకారం, ఒక వస్తువు సుమారు 11 రకాల డైమెన్షన్స్ లో ప్రయానించగలదు.

అయితే, మీరు డైమెన్షన్స్ ని సులువుగా అర్థం చేసుకోవడానికి ఈ వీడియోలో మనకు బాగా తెలిసిన ఉదాహరణలతో విషయాలను పోల్చడం జరిగింది.

అసలు Dimension అంటే ఏంటి, 1D, 2D, 3D ఇంకా 4D రకాల డైమెన్షన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..


ఏదైనా ఒక వస్తువు ప్రయాణించాలి అంటే ముందుగా అది ఏదో ఒక చోటు నుండి తన ప్రయాణాన్ని మొదలు పెట్టాలి..

ఉదాహరణకు, ఒక లిఫ్ట్ కింద ఫ్లోర్ నుండీ స్టార్ట్ అయితేనే పై ఫ్లోర్స్ కి వెళ్తుంది.. 

ఒక విమానం రన్ వే పై మొదలైతే నే గాల్లోకి ఎగురుతుంది.. 

ఈ విధంగా ఒక వస్తువు స్టార్ట్ అయ్యే చోటుని దాని యొక్క Origin అని పిలుస్తారు..

అయితే Origin కి, Dimension కి సంబంధం ఏమిటి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు..

ఇప్పుడు ఒకసారి లిఫ్ట్ ఉదాహరణకు వద్దాం.. లిఫ్ట్ తన యొక్క origin నుండీ అయితే పైవైపు, లేదా కింద వైపు మాత్రమే ప్రయానించగలదు..

మరోలా చెప్పాలంటే, అది కేవలం ఒక దిక్కులో మాత్రమే ముందుకూ వెనక్కూ ప్రయానించగలదు.

ఈ రకంగా ప్రయాణించే విధానాన్ని 1 Dimension అని పిలుస్తారు.


ఇప్పుడు మనం ఈ లిఫ్ట్ కూ, ఒక బ్లాక్ బోర్డ్ మీద రాసే చాక్ పీస్ కూ మధ్య గల తేడాను పరిశీలిద్దాం..

లిఫ్ట్ లాగానే మనం ఒక చాక్ పీస్ ని కూడా బ్లాక్ బోర్డ్ మీద పైనుంచీ కిందకు రాసేటప్పుడు తీసుకువెళ్ళగలం.. 

అయితే, లిఫ్ట్ కి భిన్నంగా చాక్ పీస్ ను మనం బోర్డుపై యెడమ నుంచి కుడివైపుకు కూడా తీసుకెళ్తాం..

ఇక్కడ చాక్ పీస్ పైకీ, కిందకీ మాత్రమే కాకుండా కుడివైపు, ఏడమవైపుకు కూడా ప్రయాణించగలుగుతుంది..

ఈ రకంగా రెండు విధాలుగా ప్రయాణించే విధానాన్ని 2 Dimension అని పిలుస్తారు.

తెరపై వేసే సినిమాల్లో కనిపించే దృశ్యాలు కూడా ఇదే విధంగా స్క్రీన్ మీద పైకీ, కిందకీ, ఏడమవైపుకి, లేదా కుడివైపుకు కదలడం చేత.. వాటిని 2D సినిమాలని అంటారు..


ఇప్పుడు మనం, ఒక హెలికాప్టర్ ప్రయాణించే తీరును పరిశీలిద్దాం..

హెలికాప్టర్ ఒక లిఫ్ట్ లాగా పైకీ కిందకీ ప్రయాణిస్తుంది..

చాక్ పీస్ లాగానే ఇది కూడా పైకీ కిందకీ వెళ్ళే క్రమంలో ముందుకీ లేదా వెనక్కీ ప్రయాణిస్తుంది..

అయితే, ఈ రెండిటికీ అదనంగా, ఇది తను ఉన్న చోటులోనే తన చుట్టూ తాను గుండ్రంగా తిరగగలదు..

ఈ రకంగా 3 విధాలుగా ప్రయాణించే విధానాన్ని 3 డైమెన్షనల్ లేదా 3D అంటారు.

ఈ విశ్వంలో ఉండే ప్రతి వస్తువు కూడా 3 డైమెన్షన్స్ కి మాత్రమే చెందిన ప్రయాణాలను చేయగలవు..


ఇప్పుడు అచ్చం ఒకేలా ఉండే రెండు హెలికాప్టర్లను తీసుకుందాం..

ఈ రెండూ ఒకే మార్గంలో హైదరాబాద్ నుండీ విజయవాడ ప్రయానించాయి అనుకుందాం..

అయితే ఒక హెలికాప్టర్ ఈరోజు ప్రయాణిస్తే, మరొకటి రేపు ప్రయాణిస్తుందని ఉదాహరణగా అనుకుందాం..

ఇప్పుడు, ఈ రెండు హెలికాప్టర్లు ఒకే విధంగా ఒకే మార్గంలో ప్రయాణించినప్పటికీ ఆ రెండూ ఒకే కాలంలో ప్రయానించలేదు..

ఈ విశ్వంలో ఉన్న ఏ రెండు వస్తువులు కూడా ఒకే కాలంలో ఒకే ప్రదేశంలో ఒకే రకంగా ఉండలేవు.. 

మరోలా చెప్పాలంటే, సముద్రంలో నిన్న వచ్చిన ఒక కెరటం మళ్ళీ అదేవిధంగా, అదే ప్రదేశంలో ఈరోజు రాదు.

ప్రతి వస్తువు యొక్క కదలిక కాలానికి ముడిపడి ఉంటుంది..

ఈ విధంగా ఒక వస్తువు యొక్క 3 డైమెన్షనల్ ప్రయాణం కాలానికి ఏవిధంగా ముడిపడి ఉందో వివరించేదే 4th dimension, లేదా 4D.


కాలాన్ని మనం కంట్రోల్ చెయ్యలేం.. అందుకే 4th Dimension లో ఒక వస్తువు ప్రయానించలేదు..

కాలాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే జరగబోయే విషయాలన్నీ మనకి ముందుగానే తెలిసిపోతాయి..

Time Travel అనే విషయం ఈ 4th Dimension ఆధారంగానే వివరించబడింది.

4th Dimension లో ఒక వస్తువు ప్రయానించగలిగింది అంటే, అది ఖచ్చితంగా Time Travel చేస్తుందని అర్థం..

దేవతలు, భూతాలు, దెయ్యాలు అనేవి కూడా కాలానికి అతీతంగా ప్రయానించగలవని మనకు తెలుసు..

ఇలాంటి శక్తులు 4th dimension లో ప్రయానించగలగడం చేతే, అవి మన కంటికి కనిపించలేనంత వేగంగా తిరగగలవని అంటారు..

4th Dimension చివరిది కాదు.. మానవ మెదడుకు సైతం అర్థం కాని ఎన్నో ఇతర డైమెన్షన్స్ కూడా ఉన్నాయని పరిశోధకులు తేల్చారు..

వాటన్నింటిని మనం అధ్యయనం చేయగలిగితే మన విశ్వం ఎలా పుట్టింది, ఎలా పనిచేస్తుంది అన్న విషయాలతో పాటు, Parallel Universes, Multiverse అనే విషయాలను కూడా పూర్తిగా అర్ధం చేసుకునే అవకాశం ఉంటుంది.. 

Popular posts from this blog

What are Hormones? (in Telugu) హార్మోన్స్ అంటే ఏమిటి?

What is Positive Thinking? (in Telugu) పాజిటివ్ థింకింగ్ అంటే ఏమిటి?

What is Habeas Corpus? (in Telugu) హెబియస్ కార్పస్ అంటే ఏమిటి?