What is Asthma? • Causes of Asthma (in Telugu) • ఆస్థమా అంటే ఏమిటి?

ఆస్థమా లేదా బ్రాంఖయల్ ఆస్థమా.. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి.

ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి సుమారు 25 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

ఊపిరితిత్తులకు చేరే వాయు మార్గాలన్ని చీముడుతో నిండిపోడం, లేదా అవి ఉబ్బడాన్ని ఆస్తమా అని అంటారు.

ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.

ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే, ప్రాణానికే ప్రమాదం తెప్పించగలదని చెప్పొచ్చు..

అయితే, ఆస్తమా ఎందుకు వస్తుంది? ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి? ఆస్తమా వ్యాధిగ్రస్తులు యెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవాటిగురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా మనం ఊపిరి తీసుకునేటప్పుడు, శ్వాసనాళాలు లేదా bronchus రిలాక్స్ అవుతాయి.

దీనివల్ల గాలి సులభంగా ఊపిరితిత్తులకు చేరడం, తిరిగి రావడం జరుగుతుంది.. కానీ, ఆస్థమా సోకినప్పుడు ఈవిధంగా జరగదు.

హఠాత్తుగా శ్వాసనాళాల యొక్క కండరాలు ఉబ్బటం చేత ఊపిరితిత్తులు తగినంత గాలిని పీల్చుకోలేవు.

అంతే కాకుండా ఆస్తమా అట్టాక్ వచ్చినప్పుడు శ్వాసకోశాలు చీమిడితో పూర్తిగా నిండిపోతాయి.

ఆస్తమా పలువిధాలుగా బాధిస్తుంది. ఈ వ్యాధి సోకిన అందరిలో ఒకే రకమైన లక్షణాలు కనిపించవు.

కొందరిలో ఈ వ్యాధి తాత్కాలికమైన లక్షణాలు కనబరుస్తూ ఉంటుంది. మరికొందరిలో విపరీతమైన లేదా ప్రాణాంతకమైన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.

ఛాతీ భాగంలో అధికమైన నొప్పి రావడం, విపరీతమైన దగ్గు, ఊపిరి తీసుకోడానికి ఇబ్బందిగా ఉండటం వంటివి ఆస్తమా యొక్క ప్రధాన లక్షణాలు.

ఆస్తమా ఎందుకు వస్తుంది అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఇంకా దొరకలేదు.

ఆస్తమా ఎవరికైనా ఏ వయసులోనైనా రావచ్చు.

అయితే, ఈ వ్యాధి సాధారణంగా dust allergy ఉన్నవారిలోనూ ఇంకా పొగ త్రాగే అలవాటు ఉన్నవారిలోనూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

పెంపుడు జంతువుల వల్ల కొంతమందికి ఆస్తమా సోకుతూ ఉంటుంది.

చెదలు, బొద్దింకలు, ఇంకా ఎలుకలు వంటివాటి వల్ల కూడా ఆస్తమా సోకే ప్రమాదం ఉంది.

ఇంకా వాతావరణ కాలుష్యం అధికంగా ఉండే ప్రాంతాలలో ఆస్తమా వ్యాధిగ్రస్తులు అధికంగా కనిపిస్తూ ఉంటారు.

ఈ వ్యాధి వంశపారపర్యంగా సోకే అవకాశం కూడా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.

అధిక పని ఒత్తిడి, వాతావరణ మార్పుల వల్ల కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది.

చిన్న వయసులో ఆస్తమా సోకినవారిలో వయసు పెరిగే కొద్దీ వ్యాధి నయమయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ఒకరిలో ఈ వ్యాధి లక్షణాలు స్వల్పంగా కనిపించినా కూడా వెంటనే ఒక  అలెర్జిస్ట్ లేదా ఇమ్యునాలజిస్ట్ ను  సంప్రదించడం చాలా మంచిది.

ఈ వ్యాధి పూర్తిగా నయమయ్యే అవకాశం లేకపోయినా, వైద్యులను సంప్రదించడం ద్వారా కనీసం వ్యాధి లక్షణాలను నియంత్రించే అవకాశం ఉంటుంది.

ఆస్తమా వ్యాధి గ్రస్తులు ఎల్లవేళలా తమ రెస్క్యూ ఇన్హేలర్ ను దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది. 

Popular posts from this blog

What are Hormones? (in Telugu) హార్మోన్స్ అంటే ఏమిటి?

What is Positive Thinking? (in Telugu) పాజిటివ్ థింకింగ్ అంటే ఏమిటి?

What is Habeas Corpus? (in Telugu) హెబియస్ కార్పస్ అంటే ఏమిటి?