What is Union Territory? (in Telugu) • యూనియన్ టెర్రిటరీ / కేంద్ర పాలిత ప్రాంతం అంటే ఏమిటి?


కేంద్రపాలిత ప్రాంతాలు లేదా యూనియన్ టెర్రిటరీలనేవి భారతదేశంలో ఒక ప్రత్యేక పరిపాలనా విభాగాలు.

భారత దేశంలో ఒకానోక ప్రాంతంలో ఉండే స్థానిక సంస్కృతి లేదా సున్నితమైన అంశాలను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతానికి యూనియన్ టెర్రిటరీ అనే స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది.

భారతదేశ భూభాగం మొత్తం వివిధ రాష్ట్రాలు, ఇంకా యూనియన్ టెర్రిటరీలుగా విభజించబడింది.

అయితే, రాష్ట్రాలు లేదా states కి వాటి సొంత ప్రభుత్వాలు ఉంటాయి. కానీ యూనియన్ టెర్రిటరీలకు మాత్రం సొంత ప్రభుత్వ పాలన అనేది ఉండదు. ఇవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం లేదా యూనియన్ గవర్నమెంట్ పరిపాలనలో ఉంటాయి.

యూనియన్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ పాలనలో ఉండటం మూలాన ఆ ప్రాంతాలకి యూనియన్ టెర్రిటరీలన్న పేరు వచ్చింది.

ఈ ప్రాంతాలు సాధారణంగా president of India లేదా రాష్ట్రపతి పాలనలో ఉంటాయి.

2022 నాటికి భారతదేశంలో మొత్తం 9 యూనియన్ టెర్రిటరీలు ఉన్నాయి.

1. Andaman and Nicobar islands,

2. Chandigarh

3. Dadra and nagar Haveli

4. Daman and Diu

5. Delhi

6. Jammu and Kashmir

7. Ladakh

8. Lakshadweep islands, ఇంకా 

9. Puducherry

Andaman Nicobar దీవులు, ఇంకా లక్షద్వీప్ దీవులను వాటి యొక్క పరిపాలనా కారణం నిమిత్తం యూనియన్ టెర్రిటరీలగా మార్చడం జరిగింది.

పుదుచ్చేరి లేదా పాండిచేరి స్వాతంత్య్రం నాటికి ఫ్రెంచ్ పాలనలో ఉండేది.

స్వాతంత్రం వచ్చిన 15 సంవత్సరాల తర్వాత పుదుచ్చేరిలో (Puducherry) ఫ్రెంచ్ పాలన పోయి భారత దేశంలో విలీనం అయ్యింది. 

1956లో ఆ ప్రాంతాన్ని కూడా యూనియన్ టెర్రిటరీగా ప్రకటించడం జరిగింది.

ఢిల్లీ ఒకప్పుడు రాష్ట్రంగా ఉన్నా 1956 లో దీన్ని యూనియన్ టెర్రిటరీ గా ప్రకటించడం జరిగింది.

అలాగే జమ్మూ కాశ్మీర్ కూడా ఒకప్పుడు రాష్ట్రంగా ఉన్నప్పటికీ అక్కడున్న రక్షణ పరమైన సమస్యల మూలాన 2019 లో కేంద్ర ప్రభుత్వం దాన్ని యూనియన్ టెర్రిటరీగా ప్రకటించింది.

రాజ్యాంగంలో పొందుపరిచిన నియమాల వల్ల యూనియన్ టెర్రిటరీలకి కొన్ని ప్రత్యేక హక్కులు ఇంకా హోదాలు ఇవ్వడం జరిగింది.

ఈ ప్రాంతాలలో ట్యాక్స్ లు వసూలు చేయడం ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం లేదా సెంట్రల్ గవర్నమెంట్ కే వెళ్తుంది.

ఈ ప్రాంతాలలో ఉండే సున్నితమైన అంశాలు పరిష్కరించిన తర్వాత వీటిని రాష్ట్రాలుగా ప్రకటించి, వాటికంటూ సొంత ప్రభుత్వాలని ఏర్పరిచే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.


Popular posts from this blog

What are Hormones? (in Telugu) హార్మోన్స్ అంటే ఏమిటి?

What is Positive Thinking? (in Telugu) పాజిటివ్ థింకింగ్ అంటే ఏమిటి?

What is Habeas Corpus? (in Telugu) హెబియస్ కార్పస్ అంటే ఏమిటి?