What is Buddhism? (Explained in Telugu) • బౌద్ధ తత్వం ఏం చెబుతోంది?
బౌద్ధ మతం లేదా buddhism ప్రస్తుతం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద మతాచారంగా గుర్తింపు పొందింది. సుమారు 52 కోట్ల మంది బౌద్ధ మత సూత్రాలను అనుసరిస్తున్నారు. బౌద్ధ మతం అనగానే మనకి మొదటిగా గుర్తొచ్చేది, ధ్యానంలో ఉండే గౌతమ బుద్ధుని నిర్మలమైన స్వరూపం... మనం బౌద్ధ మతం గురించి, ఆ మతం ప్రపంచానికి ఇస్తున్న సందేశం గురించీ తెలుసుకోబోయే ముందు 'ధర్మం' అనే శబ్దానికి అర్ధాన్ని తెలుసుకోవాలి. ధర్మం అంటే మన ముందు ఎన్నో అవకాశాలు ఉన్నప్పుడు, వాటిలో సరైనదాన్ని ఎలా ఎన్నుకోవాలో తెలుసుకోవడం. ఏ ఒక్కరికీ హాని కలిగించని సరైన నిర్ణయాలు తీసుకోవడం. ధర్మాన్నే ఆధారంగా చేసుకొని నిరాడంబరమైన జీవితాన్ని లేదా simple లైఫ్ ని అనుసరించమని తెలిపే మతమే బౌద్ధ మతం. బౌద్ధ ధర్మం, ధర్మ వినయం, buddhism.. ఇలా ప్రస్తుతం మూడు పేర్లతో ఈ మతం ప్రపంచమంతా వ్యాపించింది... బౌద్ధ ధర్మం భారతదేశానికి చెందిన ఒక ప్రాచీనమైన మతం. ఇది పూర్తిగా గౌతమ బుద్ధుడు అనే మహా జ్ఞాని చేసిన హితబోధల ఆధారంగా స్థాపించబడింది. 'బుద్ధ' అనే పదానికి అర్ధం.. జ్ఞానం. బౌద్ధ మతం పూర్తిగా జ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఉంటుంది. బౌద్ధ ధర్మం ప్రకారం, ఈ ప్రపం...