What is Reserve Bank of India? (in Telugu) • భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క పనులు ఏమిటి?
రూపాయి... ఇది మనం బ్రతకడానికి ఉపయోగపడే ఒక కాగితపు నోటు మాత్రమే కాదు. ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా పేరు గడించిన మన Indian ఎకానమీకి కూడా ప్రాణమని చెప్పవచ్చు. అయితే, మనకి ప్రతి విషయంలోనూ అవసరమైన ఈ రూపాయిని దేశ నలుమూలలకీ ప్రవహింపచేసి మన ఆర్ధిక వ్యవస్థను బ్రతికించే గుండెకాయ ఏంటో తెలుసా? అదే RBI, లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... భారతదేశంలో ఉండే బ్యాంకులన్నిటికీ రారాజు. మన చేతిలోకి వచ్చే ప్రతి కరెన్సీ నోటు పైనా, ఈ బ్యాంకు పేరుని చూడొచ్చు. RBI యొక్క స్ట్రక్చర్, దాని పనితీరు, ఇంకా అది మన దేశ ఆర్ధిక వ్యవస్థ నిర్మాణానికి ఏ విధంగా తోడ్పడుతుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం... భారతదేశంలో జరిగే అన్ని ట్రాన్సాక్షన్స్ కేవలం రూపాయి కరెన్సీలో జరుగుతాయి. లావాదేవీలు జరపడానికి అవసరమైన కరెన్సీ నోట్లనూ, చిల్లర కాసులనూ RBI ముద్రిస్తుంది. ఇంటర్నెట్ ఆధారిత డిజిటల్ లావాదేవీలను కూడా RBI పర్యవేక్షిస్తుంది. Reserve Bank Of India లేదా RBI 1935 లో స్థాపించబడింది. దీని ముఖ్య ఉద్దేశం, భారతీయ ఆర్ధిక వ్యవస్థని విజయవంతంగా నడిపించడం. భారతదేశంలో ఉండే అన్ని బ్యాంకులు RBI పర్యవేక్షణలోనే ఉంటా...