What is Love? Why do we love someone? Meaning of Love (in Telugu) • 'ప్రేమ' అంటే ఏమిటి?
ఈ భూమిమీద ఉండే ఏ జీవికైనా ఎమోషన్స్ ఉంటాయని మనం నమ్ముతాం. అంటే సంతోషం, దుఃఖం, బాధ, కోపం, జాలి, ఇలాంటివి... అయితే అన్ని జీవరాశులలోనూ కామన్ గా కనిపించే ఒక అందమైన ఎమోషన్... ప్రేమ... ప్రేమించడం మనకి తెలుసు. అందరూ ఒకేలా ప్రేమించక పోవచ్చు, బట్ ప్రేమించడంలో ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది.ఒక వ్యక్తిని ఎంతలా ప్రేమిస్తామో చెప్పగలం కానీ ఎందుకు ప్రేమిస్తామో కచ్చితంగా చెప్పలేం! సైకాలజీ ప్రకారంగా ప్రేమ యొక్క లోతుల్ని తెలుసుకొని, అసలు ఒకరిపై ఒకరికి ప్రేమ అనేది ఎందుకు పుడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం... సింపుల్ గా చూసినప్పుడు, ప్రేమ అనేది ఇద్దరు వేరువేరు మనుషులని, వారి మనసులని ఏకం చేస్తుంది... కేవలం ఒక మనిషి మాత్రమే కాదు, ఈ ప్రకృతిలో ఎలాంటి జీవైనా తన జీవితంలో వేరొక జీవిని ప్రేమిస్తుంది. ఇంత అనంతమైన ప్రకృతితో పాటూ ఇందులో మనం చూసే అనేక కోట్ల జీవరాశులు పుట్టడానికీ, కలిసి జీవించడానికీ గల కారణం kuda ప్రేమే... ఒక జీవికి మరొక జీవి పరస్పరం సహాయపడేలా చేస్తూ, జీవితంలో కష్టాలనూ, బాధలనూ ఓర్చుకొని ముందుకు సాగగలమనే ధైర్యాన్ని ఇచ్చే గొప్ప సాధనమే ప్రేమ... అయితే, ప్రేమకు షరతులు లేవు... ఎవరైనా,...