What is Love? Why do we love someone? Meaning of Love (in Telugu) • 'ప్రేమ' అంటే ఏమిటి?
ఈ భూమిమీద ఉండే ఏ జీవికైనా ఎమోషన్స్ ఉంటాయని మనం నమ్ముతాం. అంటే సంతోషం, దుఃఖం, బాధ, కోపం, జాలి, ఇలాంటివి... అయితే అన్ని జీవరాశులలోనూ కామన్ గా కనిపించే ఒక అందమైన ఎమోషన్... ప్రేమ...
ప్రేమించడం మనకి తెలుసు. అందరూ ఒకేలా ప్రేమించక పోవచ్చు, బట్ ప్రేమించడంలో ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది.ఒక వ్యక్తిని ఎంతలా ప్రేమిస్తామో చెప్పగలం కానీ ఎందుకు ప్రేమిస్తామో కచ్చితంగా చెప్పలేం!
సైకాలజీ ప్రకారంగా ప్రేమ యొక్క లోతుల్ని తెలుసుకొని, అసలు ఒకరిపై ఒకరికి ప్రేమ అనేది ఎందుకు పుడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం...
సింపుల్ గా చూసినప్పుడు, ప్రేమ అనేది ఇద్దరు వేరువేరు మనుషులని, వారి మనసులని ఏకం చేస్తుంది... కేవలం ఒక మనిషి మాత్రమే కాదు, ఈ ప్రకృతిలో ఎలాంటి జీవైనా తన జీవితంలో వేరొక జీవిని ప్రేమిస్తుంది.
ఇంత అనంతమైన ప్రకృతితో పాటూ ఇందులో మనం చూసే అనేక కోట్ల జీవరాశులు పుట్టడానికీ, కలిసి జీవించడానికీ గల కారణం kuda ప్రేమే...
ఒక జీవికి మరొక జీవి పరస్పరం సహాయపడేలా చేస్తూ, జీవితంలో కష్టాలనూ, బాధలనూ ఓర్చుకొని ముందుకు సాగగలమనే ధైర్యాన్ని ఇచ్చే గొప్ప సాధనమే ప్రేమ...
అయితే, ప్రేమకు షరతులు లేవు... ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరినైనా ప్రేమించవచ్చు...
kevalam ఒకరి physical body ni చూసి ఒక వ్యక్తి ప్రేమలో పడటమనేది అపోహ మాత్రమే... మన భావోద్వేగాలను అర్థం చేసుకొని, మనపై నమ్మకం పెట్టుకొన్న వ్యక్తుల్నే మనం జీవితంలో ప్రేమిస్తాం...
మనం ప్రేమించే వ్యక్తో లేదా విషయమో మనతో ఉన్నప్పుడు, మనలో సంతోషం, కృతజ్ఞత, ఇంకా empathy భావాలు కలుగుతాయి.
మనుషుల మధ్య రిలేషన్స్, ఇంకా ఫ్యామిలీస్ అనేవి ఏర్పడడానికి గల కారణం కూడా ప్రేమే...
అయితే, ప్రేమ ఒక మనిషికి బలాన్ని ఇవ్వడమే కాదు, బలహీనతలను కూడా పరిచయం చేస్తుంది. ప్రేమించిన వ్యక్తిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, వారు లేకపోతే మనమే లేమనే భావన మనలో కలిగేలా చేస్తుంది.
స్వామి వివేకానంద మాటల్లో చెప్పాలంటే, ప్రేమ అన్నది జీవితాన్ని నడిపించే సూత్రం. అది మనగురించి మనకి మాత్రమే కాకుండా ఇతరులకు కూడా తెలిసేలా చేస్తుంది.
ప్రేమకు చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎన్నో సామ్రాజ్యాలను నెలకొల్పడంతో పాటూ, మరెన్నిటినో నాశనం అవ్వడానికి కూడా దారి తీసింది... ఎన్నో యుద్ధాలకు కారణం అయ్యింది...
తన భార్య అయిన ముంతాజ్ బేగంపై తనకి ఉన్న ప్రేమకు గుర్తుగా షాహ్ జహాన్ 17వ శతాబ్దంలో నిర్మించిన తాజ్ మహాల్ ఈనాటికీ ప్రపంచంలో ఒక అద్భుతంగా నిలిచి ఉంది.
మన భారతదేశంలో హిందూమత పురాణాల్లోనూ, ఇంకా దేవాలయాల్లోనూ రాధాకృష్ణులు మనకు ప్రేమకు ప్రతీకలుగా కనిపిస్తారు...
మనం ప్రేమ యొక్క పరిమితులను దాటినప్పుడు, ప్రకృతి మనకి మరింత అందంగా కనిపిస్తుంది... పచ్చని చెట్లు, వికసించే పూలు, రంగులు, మూగ జీవులు, ఇలా మన చుట్టూ ఉన్న ప్రతి విషయం కూడా ఎంతో గొప్పగా కనిపిస్తాయి...
ఇంతకీ ప్రేమ లేదా ఆకర్షణ ఎందుకు పుడుతుంది?
ఒకరి మనో భావాలు మరొకరితో కలవడం, పర్సనాలిటీ మ్యాచ్ కావడం, లేదా ఒకరి శరీరం నుండి వచ్చే సుగంధం వల్ల కూడా మనలో ఆకర్షణ పుడుతుందని సైకాలజీ చెబుతుంది.
ప్రేమ ఇంకా బాధ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఉదాహరణకి, ప్రేమించిన వ్యక్తి దగ్గరగా ఉంటే ఎంత ఆనందంగా ఉంటామో, దూరమైతే అంతే బాధలో మునిగిపోతాం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే!
బాధ యొక్క విలువను మనకి తెలిసేలా చేస్తుంది కాబట్టే, ప్రేమను అంత గొప్పగా మనం వర్ణిస్తాం...
ప్రేమ ఎన్నో రకాలుగా పనిచేస్తుంది. రొమాంటిక్ లవ్ మనలో కోరికల్ని ప్రేరేపిస్తే, స్నేహమని పిలువబడే ప్రేమ మనకి ఒకరిపై ఉండే నమ్మకాన్ని పెంచుతుంది. మన కుటుంబ సభ్యులపై ఉండే ప్రేమ, మనలో బాధ్యతా తత్వాన్ని పెంచుతుంది.
మనపై మనకి ఉండే ప్రేమ మనలోని ఆత్మ స్థైర్యాన్ని, ఆత్మవిస్వాసాన్ని పెంచుతుంది. సో. ప్రేమ అంటే ఇద్దరు మనుషుల మధ్య ఉండేదే కాదు. మనపై మనకి ఉండేది కూడా. ప్రేమ మనమేంటో మనకి చివరికి తెలిసేలా చేస్తుంది.
ప్రేమకు ఎటువంటి హద్దులు, కట్టుబాట్లు లేవు. అందరికీ ఒకేలా కనిపిస్తుంది. అందరికీ ఒకే రకమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇదే మనల్ని కలిపి ఉంచుతుంది.
ఇంత అందమైన ప్రేమ మీతోనే ఎప్పుడూ ఉంటూ మీ చుట్టూ ఉన్న వారిని కూడా మీతో ఎప్పటికీ ఉండేలా చేస్తుంది.