What is JAVA? (in Telugu) | Introduction to Programming Language | Features of JAVA
సాఫ్ట్వేర్ రంగంలో అడుగుపెట్టాలని అనుకునేవారికి JAVA ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సరైన ఎంపిక. అయితే మనం JAVA కోసం తెలుసుకునే ముందు, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకు ఉపయోగపడతాయనేది తెలుసుకోవాలి. మనం ప్రతిరోజూ ఏ పని చేయడానికి అయినా మెషీన్స్ మీద ఆధార పడుతున్నాం. ఉదాహరణకు ఎటిఎం మెషీన్స్ ని చూద్దాం... మనం కార్డు పెట్టగానే మన డీటెయిల్స్ అన్నీ స్క్రీన్ పై వెంటనే వచ్చేస్తాయి. మన అకౌంట్ లో బాలన్స్ ఎంతుందో చెప్పడంతో పాటూ మనం డిపాజిట్ లేదా విత్ డ్రా చేసినవెంటనే మన అకౌంట్ లో బాలన్స్ మారిపోతుంది. ఇప్పట్లో బ్యాంకు ఉద్యోగులు చేసే పనులన్నిటినీ క్షణాల్లో ఒక ATM మెషిన్ చేయగలుగుతుంది. అయితే యంత్రాలకి ఈ పనులు చేయడం ఎవరు నేర్పించారు? మన అవసరాలకి తగినట్టు మెషిన్లు రోజురోజుకూ ఎలా అప్డేట్ అవుతున్నాయి? దీనికి సమాధానమే ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్ ద్వారా మనం యంత్రాలను లేదా ఎలక్ట్రానిక్ డివైజ్ లను మనకి కావలసినట్టుగా పనిచేసేటట్లు చేయగలం. అయితే ప్రోగ్రామింగ్ చేయాలంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజస్ అనేవి తెలిసి ఉండాలి. మనకి ఇప్పట్లో C, JAVA, PYTHON, PHP...