What is JAVA? (in Telugu) | Introduction to Programming Language | Features of JAVA
సాఫ్ట్వేర్ రంగంలో అడుగుపెట్టాలని అనుకునేవారికి JAVA ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సరైన ఎంపిక. అయితే మనం JAVA కోసం తెలుసుకునే ముందు, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకు ఉపయోగపడతాయనేది తెలుసుకోవాలి.
మనం ప్రతిరోజూ ఏ పని చేయడానికి అయినా మెషీన్స్ మీద ఆధార పడుతున్నాం. ఉదాహరణకు ఎటిఎం మెషీన్స్ ని చూద్దాం... మనం కార్డు పెట్టగానే మన డీటెయిల్స్ అన్నీ స్క్రీన్ పై వెంటనే వచ్చేస్తాయి. మన అకౌంట్ లో బాలన్స్ ఎంతుందో చెప్పడంతో పాటూ మనం డిపాజిట్ లేదా విత్ డ్రా చేసినవెంటనే మన అకౌంట్ లో బాలన్స్ మారిపోతుంది. ఇప్పట్లో బ్యాంకు ఉద్యోగులు చేసే పనులన్నిటినీ క్షణాల్లో ఒక ATM మెషిన్ చేయగలుగుతుంది. అయితే యంత్రాలకి ఈ పనులు చేయడం ఎవరు నేర్పించారు? మన అవసరాలకి తగినట్టు మెషిన్లు రోజురోజుకూ ఎలా అప్డేట్ అవుతున్నాయి? దీనికి సమాధానమే ప్రోగ్రామింగ్.
ప్రోగ్రామింగ్ ద్వారా మనం యంత్రాలను లేదా ఎలక్ట్రానిక్ డివైజ్ లను మనకి కావలసినట్టుగా పనిచేసేటట్లు చేయగలం. అయితే ప్రోగ్రామింగ్ చేయాలంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజస్ అనేవి తెలిసి ఉండాలి. మనకి ఇప్పట్లో C, JAVA, PYTHON, PHP మొదలైన ఎన్నో రకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. వీటన్నిటిలో, నేర్చుకోడానికి సులువుగా ఉండడంతో పాటూ కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు వంటి రోజువారీ డివైస్ లను పనిచేయించగల ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, JAVA.
ప్రపంచంలో ఎదుగుతున్న కంపెనీలన్నీ ఇప్పట్లో యాప్ లు ఇంకా సాఫ్ట్వేర్ ల ద్వారా జనాలకి చేరువగా మారుతున్నాయి. సో, మీరు గనక JAVA పై పట్టు సాధించినట్లైతే software కెరీర్ లో అడుగుపెట్టగలరు. మీ సొంత యాప్ లు, ఇంకా సాఫ్ట్వేర్ లు తయారుచేయగలరు. ఇప్పట్లో మనం వాడుతున్న AMAZON, UBER, GOOGLE, NETFLIX మొదలైన యాప్ లు JAVA ప్రోగ్రామింగ్ ద్వారానే నిర్మించబడ్డాయి.
JAVA ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఉన్న ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం...
మొదటిగా JAVA అనేది నేర్చుకోడానికి ఒక సులువైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కేవలం ఇంగ్లీష్ మాట్లాడడం వస్తే చాలు. ఆటోమేటిక్ గా మనం JAVA కోడ్ ని కూడా చాలా వరకూ అర్ధం చేసుకోగలం. మాథెమాటిక్స్ లో ఒక కష్టమైన లెక్క ని సాల్వ్ చేయడానికి ఒక మనిషి 10 నిమిషాల సమయం తీసుకుంటే, అదే లెక్కను సాల్వ్ చేయడానికి JAVA ప్రోగ్రాం ఒక క్షణం కంటే తక్కువ సమయాన్ని తీసుకుంటుంది. ఈ విషయం వల్లే, కంప్యూటర్లు మానవ మెదడు కంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
JAVA ను platform-independent language అని అంటారు. అంటే, మనం ఒక డివైస్ లో చేసిన JAVA కోడ్ ఇతర డివైస్ లకు షేర్ చేయవచ్చు. ఇంకా వాటిలో కూడా అది పనిచేసేలా చేయవచ్చు. కంప్యూటర్ లో JAVA ద్వారా భద్రపరచిన డేటా ఇంకా కోడ్ లను స్మార్ట్ ఫోన్ లోకి, ఇతర కంప్యూటర్ల లోకీ పంపించవచ్చు.
JAVA ను Object-Oriented language అని కూడా అంటారు. అంటే ఒకరు ఒరిజినల్ గా రాసిన java కోడ్ లో ఉన్న డేటా ను మనం కొత్తగా రాసుకున్న వేరొక java కోడ్ లో అవసరానికి తగినట్లుగా object లా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఒరిజినల్ కోడ్ భద్రంగా ఉంటుంది. అందులోని డేటాని మార్చడం వీలుపడదు.
JAVA ను Robust లాంగ్వేజ్ అని కూడా అంటారు. మనం రాసిన కోడ్ లో తప్పులు ఇంకా ఎర్రర్స్ ఉన్నట్లయితే code RUN అవుతున్న సమయంలో మనకి ఎర్రర్స్ ని చూపించి, వాటిని ఎలా సరిచెయ్యాలో కూడా మనకి చెబుతుంది. ఇంకా JAVA multi-threading ను సపోర్ట్ చేస్తుంది. అంటే ఒకే సమయంలో మనం అనేక JAVA ప్రోగ్రామ్ లను ఒక దానితో మరొకటి సంబంధం లేకుండా రన్ చేయగలం.
JAVA తో ప్రోగ్రామింగ్ చేయడం ఎంతో సురక్షితం. JAVA కోడ్ ఒకసారి రాసిన తరువాత COMPILATION జరిగి byte కోడ్ లా మారిపోతుంది. ఒకసారి byte కోడ్ గా మారిన తర్వాత దానిని డీకోడ్ చేయడం ఎలాంటి హ్యాకర్ కు సాధ్యం కాదు. JAVA ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం చాలా సులువు. మనంతట మనమే నేర్చుకునే విధంగా ఎన్నో ఫ్రీ ప్లాటుఫార్మ్ లు ఉన్నాయి. అందులో నేను మీకు సజెస్ట్ చేసేవి, SOLOLEARN ఇంకా W3SCHOOLS. ఈ రెండు వెబ్సైట్లను మనకోసం JAVA సులువుగా అర్ధం అయ్యే విధంగా రూపొందించారు.
చాలా మందికి JAVA ప్రోగ్రామింగ్ అంటే భయం పుడుతుంది. ఎందుకంటే ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు మనకు చాలా రకాల సవాళ్లు ఎదురవుతాయి. JAVA నేర్చుకునే సమయంలో ఎదురయ్యే కొన్ని సవాళ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ముందుగా JAVA ప్రోగ్రామింగ్ అంతా కూడా KEYWORDS అనే వివిధ రకాల ఇంగ్లీష్ పదాలమీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు int, char, String, boolean, system లాంటి పదాలు. KEYWORDS అనేవి మనకు సులువుగా గుర్తుండే ఇంగ్లీష్ పదాలే అయినా కూడా ఏ సందర్భంలో ఏ KEYWORD వాడాలన్నది అసలు విషయం. ఏ KEYWORD ఏ పని చేస్తుంది అనేది మనకు పూర్తిగా అర్ధం కావడానికి కనీసం కొన్ని వారాల సమయం పడుతుంది. ఉదాహరణకు, INT అనే KEYWORD ని ఉపయోగించడం ద్వారా మనం ఒక సంఖ్యా లేదా నెంబర్ ని మన JAVA ప్రోగ్రాం లో చేర్చగలం. PRINT అనే KEYWORD ని ప్రోగ్రామ్ లో వాడటం ద్వారా మనకు కావలసిన విషయాన్ని SCREEN పైన display అయ్యేలా చేయగలం.
రెండోది, JAVA ప్రోగ్రామింగ్ లో కొన్ని షరతులు ఇంకా కండిషన్స్ ఉంటాయి. అంటే, ఏ keyword ఎక్కడ ఉపయోగించాలో తెలియకపోయినా, అనుకోకుండా ఒక keyword కి బదులు ఇంకొక keyword వాడినా, ప్రోగ్రామ్ RUN కాకుండా పూర్తిగా నిలిచిపోతుంది. ఇలాంటివి జరిగినప్పుడు చాలా వరకు మనం నిరుత్సాహ పడిపోతాం. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని క్రమం తప్పకుండా రోజూ ప్రాక్టీస్ చేస్తే JAVA ప్రోగ్రామింగ్ లో మనం ఒక ప్రొఫెషనల్ గా ఎదగొచ్చు.