What are Hormones? (in Telugu) హార్మోన్స్ అంటే ఏమిటి?
మానవ శరీరం వివిధ రసాయనాలు, లేదా CHEMICALS తో తయారైన ఒక వ్యవస్థ.. ప్రపంచంలో సుమారు 800 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నపప్టికీ ఏ ఇద్దరి శరీరాలు, ఆరోగ్యం ఒకే రకంగా ఉండవు.. ఒక మనిషి యొక్క రూపూ, బరువూ, ఆరోగ్యం దేనిమీద ఆధారపడి ఉంటాయి? స్త్రీ పురుషుల యొక్క శారీరక పెరుగుదల ఎందుకు విభిన్నంగా జరుగుతుంది? వీటిని అర్థం చేసుకోవాలంటే మానవ శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ అనే వాటి గురించి తెలుసుకోవాలి.. హార్మోన్స్ అంటే ఏంటి? శరీరంలో అవి ఏవిధంగా పనిచేస్తాయి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం... మానవ శరీరం జీవించడానికి గాలి, నీరు, ఆహారం వంటివి తీసుకొని, వాటి ద్వారా శక్తిని గ్రహిస్తుంది. అదే విధంగా ఆరోగ్యంగా ఉండడానికి నిద్ర, శారీరక శ్రమ, మానసిక ఆనందం అనే వాటిని కూడా పొందుతుంది. ఈ మొత్తం ప్రక్రియను జీవక్రియ లేదా METABOLISM అని అంటారు. జీవక్రియ ను నియంత్రించడానికి శరీరంలోని అవయవాలు హార్మోన్స్ అనే జీవ రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. హార్మోన్స్ శరీరావయవాలలో ఉండే వివిధ గ్రంధుల ద్వారా విడుదల అవుతూ ఉంటాయి. శరీర పెరుగుదలకు, అవయవాల అభివృద్ధికి, సంతానోత్పత్తికి హార్మోన్స్ ఎంతో అవసరం. శరీరంలో జరిగే ఒక్కో చర్యను ఒక్క...